శ్రీ విశాల్ గున్ని ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన విశాఖపట్నం రేంజ్ అదనపు ఎస్పీలు, ఏస్పీలు

 డిఐజిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ విశాల్ గున్ని ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన విశాఖపట్నం రేంజ్ అదనపు ఎస్పీలు, ఏస్పీలు*



*విశాఖపట్నం, ఫిబ్రవరి 13:* 

విశాఖపట్నం రేంజ్ పరిధిలోని  అదనపు ఎస్పీలు, ఏఎస్పీలు శ్రీ విశాల్ గున్ని వారిని కైలాసగిరి పోలీస్ గెస్ట్ హౌస్ వద్ద మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.


అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం పార్వతిపురం జిల్లాల సంబంధించిన అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలలో శాంతి భద్రతలు మరియు కమ్యూనిటీ పోలీసింగ్ తదితర విషయాలపై వారితో డీఐజీ గారు చర్చించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో ముందస్తు భద్రతాపరమైన చర్యల్లో భాగంగా చెక్ పోస్ట్ ల వద్ద విస్తృత తనిఖీలు నిర్వహించాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. 


ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ ( చింతూరు సబ్ డివిజన్)

పి.సత్యనారాయణ రావు, (అనకాపల్లి), శ్రీమతి ప్రేమ్ కాజల్ (శ్రీకాకుళం), ఏఎస్పీలు శ్రీ కే.ధీరజ్ ఐపీఎస్,(రంపచోడవరం), శ్రీ జగదీష్ ఆడహల్లి ఐపీఎస్ (పాడేరు), శ్రీ సునీల్ షరోన్ ఐపీఎస్ (పార్వతీపురం) ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,