పదిేళ్లుగా పోరాడుతున్నాం.. మా సమస్యపై అసెంబ్లీలో మాట్లాడండి
పదిేళ్లుగా పోరాడుతున్నాం.. మా సమస్యపై అసెంబ్లీలో మాట్లాడండి విజయవాడలో బీసీ మంత్రిని కలిసిన పిరమలై కల్లర్ కులస్తులు చిలకలూరిపేట..... న్యూస్ 9 ప్రతినిధి విజయవాడ: తమ కులానికి సంబంధించిన సమస్యను పరిష్కరించాలని కోరుతూ పిరమలై కల్లర్ కులస్తుల ప్రతినిధులు విజయవాడలో బీసీ మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. గత పదేళ్లుగా తమ సమస్య పరిష్కారం కోసం పోరాడుతున్నామని, తమ పిల్లలు, కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తమకు కొలత డ్యూటీ లేకపోవడంతో ఉపాధి పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యపై అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు మంత్రిని కోరారు. ఇప్పటికే తమ సమస్యపై పలుమార్లు మంత్రిని కలిశామని, తాజాగా ఇది ఐదోసారి కలవడం జరుగుతోందని ప్రతినిధులు తెలిపారు. తమ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఈసారి తమ సమస్యపై అసెంబ్లీలో మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు ప్రతినిధులు తెలిపారు. సమస్య పరిష్కారానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నట్లు వారు వెల్లడించారు. మంత్రిని కలిసిన వారిలో పిరమలై కల్లర్ ...