Posts

Showing posts with the label climate

ప్రముఖ అపాచీ షూ కంపెనీలో దారుణ హత్య

Image
 తిరుపతి జిల్లా తడ మండలం  బ్రేకింగ్ న్యూస్... ప్రముఖ అపాచీ షూ కంపెనీలో దారుణ హత్య  తిరుపతి జిల్లా తడ మండలంలో మాంబట్టు లోని ప్రముఖ అపాచీ షూ కంపెనీ తయారీ సంస్థ లో దారుణ హత్య చోటుచేసుకుంది కంపెనీలో పనిచేస్తున్న ఓ వివాహితను దారుణ హత్య చేశాడు  వివరాల్లోకెళితే... మృతురాలిది దొరవారిసత్రం మండలం కుమ్మరిపాలెం గ్రామం దళితవాడ ఎస్సీ కాలనీకి చెందిన ఎర్రబోతు వనజ ..27 సంవత్సరాలు వెంకటాద్రి 31 సంవత్సరం గత అపాచీ కంపెనీలో 11 సంవత్సరాల నుంచి భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా పనిచేసుకుంటూ కేవలం సాగిస్తున్నారు ఈలోగా మృతురాలికి శాపంగా మారిన అదే గ్రామానికి చెందిన డీప్ ప్లాంట్లో మెయిన్ జూరు సురేష్ అనే యువకుడు 23 సంవత్సరాలు గత కొంతకాలంగా మూడు సంవత్సరాల నుండి ఎర్రబోతు వనజాను లైంగికంగా వేధిస్తున్నాడు మరియు గత ఎన్నోసార్లు తడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగినది కేసు కూడా జరుగుతున్నది ఈలోగా వనజ మృత్యువాత పడింది ముద్దాయి కోసం తడ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కొండప్ప నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

రాబోయే నాలుగు రోజుల్లో విస్తారంగా వర్షాలు

Image
  *రాబోయే నాలుగు రోజుల్లో విస్తారంగా వర్షాలు* విశాఖపట్నం: ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. వీటి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, మంగళ, బుధ, గురువారాల్లో కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. 'సోమవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది' అని తెలిపింది. ఆదివారం తిరుపతి, అల్లూరి సీతారామరాజు, అనంతపురం, కర్నూలు, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా శ్రీకాళహస్తిలో 62.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

Image
  నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు AP: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో వ‌ర్షాలు కురుస్తాయ‌ని రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ వెల్ల‌డించింది. నేడు అల్లూరి, ఏలూరు, విజయనగరం, మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఏపీలో వచ్చే రెండు రోజులు.... ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు*

Image
  *ఏపీలో వచ్చే రెండు రోజులు.... ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు* నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, కర్ణాటకలోని మిగిలిన భాగాలు, దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ & కోస్తాంధ్ర మరికొన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రాయలసీమ మరియ పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం, కోస్తా కర్ణాటక ప్రాంతంలో మరొక ఆవర్తనం విస్తరించి ఉందన్నారు. గురువారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ...

రేపటికి వాయుగుండం.. తర్వాత తుఫాన్‌గా మార్పు

Image
  ‘Remal’ Cyclone: బంగాళాఖాతంపై కొనసాగుతున్న అల్పపీడనం..  _ రేపటికి వాయుగుండం.. తర్వాత తుఫాన్‌గా మార్పు! బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. దాని తీవ్రత క్రమంగా పెరుగుతుంది. రేపటికి వాయుగుండం గాను ఆ తర్వాత తీవ్రవాయుగండం గాను బలపడి మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారుతుంది. తుఫాన్‌గా మారితే ఒమన్ దేశం సూచించిన ‘రెమాల్’ గా నామకరణం చేస్తారు. ప్రస్తుతానికి ఈశాన్య దిశగా కదులుతుంది అల్పపీడనం. సుస్పష్టమైన అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడుతూ ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. వీటి ప్రభావం ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ తో పాటు బంగ్లాదేశ్ పైన ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అల్పపీడనం ప్రభావం అంతా మధ్య బంగాళాఖాతంలోనే ఎక్కువ. ఆ ప్రాంతంలోనే ఎక్కువ వర్షపాతం కురుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో తేలిక పాటి వర్షాలకురుస్తాయని అంటున్నారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి సునంద. వాతావరణ శాఖ అధికారులు. భూభాగం పైనుంచి ఏపీ వైపు గాలుల్లో వేస్తున్న నేపథ్యంలో ఉష్ణోగ్రతలకు క్రమంగా పెరుగుతున్నాయని అంటున్నారు. ఇక అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడురోజులపాట...

వాతావరణం

Image
  AP: అల్పపీడనం ప్రభావంతో రేపు మన్యం, అల్లూరి,ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్,అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో  అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు శ్రీకాకుళం9, విజయనగరం5 ,మన్యం11, అల్లూరి  కూనవరం మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ~ ఏపీ విపత్తుల  సంస్థ

ద్రోణి ప్రభావంతో నేడు

Image
 AP ద్రోణి ప్రభావంతో నేడు   మన్యం,అల్లూరి,అనకాపల్లి, విశాఖ,కృష్ణా, కర్నూలు,నంద్యాల,అనంతపురం,శ్రీ సత్య సాయి, వైఎస్ఆర్, అన్నమయ్య,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు..

_తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. మరికొద్ది గంటల్లో ఈ జిల్లాలో వర్షాలు_

Image
  *_తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. మరికొద్ది గంటల్లో ఈ జిల్లాలో వర్షాలు_* వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరోసారి చల్లటి కబురు చెప్పింది. ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని.. అంచనా వేసింది. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, భువనగిరి, మెదక్, కామారెడ్డి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురువనున్నట్లు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ప్రకాశం జిల్లా, అనకాపల్లి జిల్లాలో ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసాయి. _అలాగే హైదరాబాద్ మహానగరంలో కురిసిన భారీ వర్షానికి పట్టణం అతలాకుతలం అయింది._ దీంతో రాష్ట్రంలో వాతావరణం చల్లబడినప్పటికి మళ్లీ ఎండలు దంచికొట్టాయి.

నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Image
  నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు నేడు ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి విజయనగరం, కృష్ణా, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇక శనివారం కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో 28.2 మిమీ, తిరుపతి జిల్లా పుత్తూరులో 27.2మిమీ, కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో 14 మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.

పోలింగ్ రోజున తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

Image
 పోలింగ్ రోజున తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అలాగే ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. అయితే ఎన్నికలు జరగనున్న మే 13న తెలంగాణ, ఏపీలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది

ఎల్లుండి రాష్ట్రంలో భారీ వర్షాలు

Image
 *ఎల్లుండి రాష్ట్రంలో భారీ వర్షాలు* AP: ఈ నెల 7న రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.  శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.  మిగతా చోట్ల తేలికపాటి వానలు పడతాయని తెలిపింది.  కాగా ఇవాళ 30 మండలాల్లో తీవ్ర వడగాలులు, 247 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

ఎండలు భగభగ..

Image
 AP Weather Report: ఏపీలో ఎండలు భగభగ.. మరో మూడు రోజుల పాటు మాడు పగిలే ఎండలు! 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దడ పుట్టిస్తున్నాయి. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా వడగాల్పులు మళ్లీ ఠారెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మండుతున్న ఎండలు మరింత తీవ్రతరం కానున్నాయి. నాలుగైదు రోజుల క్రితం ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఫలితంగా ఎండలు కాస్త తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దడ పుట్టిస్తున్నాయి. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా వడగాల్పులు మళ్లీ ఠారెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మండుతున్న ఎండలు మరింత తీవ్రతరం కానున్నాయి. నాలుగైదు రోజుల క్రితం ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఫలితంగా ఎండలు కాస్త తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ.. మారిన వాతావరణ పరిస్థితులతో అవి రాష్ట్రంపై ప్రభావం చూపించలేక పోయాయి. దీంతో వానలు ఊరించి ఉసూరుమనిపించాయి. ఉష్ణోగ్రతల పెరుగుదల మళ్లీ మొదలై వడగాడ్పులు తీవ్ర రూపం దాల్...

ఏపీ వాసులకు అలర్ట్‌.. ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు

Image
 AP Weather: ఏపీ వాసులకు అలర్ట్‌.. ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగ నిప్పులు కక్కుతున్నాడు. ఐఎండీ సూచనల ప్రకారం.. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఆంధ్రప్రదేశ్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఈసారి ఎక్కువ రోజులపాటు వడగాల్పులు వీయవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు.. రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(109) :- శ్రీకాకుళం24 , విజయనగరం25, పార్వతీపురంమన్యం14, అల్లూరిసీతారామరాజు6, విశాఖపట్నం3, అనకాపల్లి16, కాకినాడ11, కోనసీమ1, తూర్పుగోదావరి 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. గురువారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 44.1 డిగ్రీలు, వైయస్సార్ జిల్లా చిన్నచెప్పల్లిలో 43.9డిగ్రీలు, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.8 డిగ్రీలు, ప్రకాశం జిల్లా దరిమడుగు 43.6, అనంతపురం జిల్లా తెరన్నపల్లి 43.5, నెల్లూరు జిల్లా మనుబోలు, తిరుపతి జిల్లా చియ్యవరంలో 43.2, శ్రీసత్యసాయి జిల్లా కుటగుల్లలో 43.1 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 18 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించార...

ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన.

Image
 _*ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన. .*_  _*ఆంధ్ర, తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం..*_ _*పలు చోట్ల ఉరుములతో కూడిన వర్షం..*_  _*శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం.*_

హోమ్ ఓటింగ్ కు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్

Image
 హోమ్ ఓటింగ్ కు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్ ఆంధ్ర ప్రదేశ్: మే 13న జరగనున్న ఎన్నికల్లో 85 సంవత్సరాలు పై బడిన వారు, శారీరక వైకల్యం ఉన్న ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ జారీకి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫార్మ్ -12 సమర్పించాక పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయలేరు. శారీరక వైకల్యం నిర్ధారించిన మేరకు ఉంటేనే ఈ హోమ్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు అనుమతి ఇస్తారు. పోలింగ్ తేదీ 13వ తేదీకు పది రోజులు ముందు నుంచి వారు ఇంటి వద్ద నుంచి ఓటు వేయవచ్చు. వారు వేసిన ఆ పోస్టల్ బ్యాలెట్ ఓటును 2 కవర్లలో పోలింగ్ బాక్స్ లలో వుంచుతారు.

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం

Image
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.  అప్రమత్తంగా ఉండండి. దయచేసి వ్యవసాయ పనుల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి.