Posts

Showing posts with the label Gallery

రైన్ బస్సులుగా మారిన ఆరెంజ్ టూర్స్ అండ్ ట్రావెల్ బస్సులు

Image
 *రైన్ బస్సులుగా  మారిన ఆరెంజ్ టూర్స్ అండ్ ట్రావెల్ బస్సులు* * ప్రాణాలకు గ్యారెంటీ లేని ట్రావెల్ బస్సులు * సరియైన ప్రమాణాలు పాటించని ట్రావెల్ సంస్థలు *  మీరు ఏదైనా టూర్ కి గాని,  స్వస్థలాలకు,  గాని పనిమీదగా ఇతర ప్రదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళవలసి వచ్చిందా జర భద్రం ప్రయాణికులారా... టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సులను నడుపుతున్న కొన్ని సంస్థలు సరైన మెయింటెనెన్స్ లేక బస్సులు ఫైర్ జరిగి కాలిపోవడం, బ్రేక్ ఫెయిల్ అయి యాక్సిడెంట్లు జరగటం పరిపాటిగా చూస్తుంటాం.. కానీ ఇప్పుడు డామేజ్ కి గురై ఏసీ బస్సులు కాస్త రైన్ బస్సులు గా మారుతున్నాయి... వివరాల్లోకి వెళితే శుక్రవారం రాత్రి గోవా నుంచి హైదరాబాదు వస్తున్న ఆరెంజ్ టూర్ అండ్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికులకు చేదువనుభవం ఎదురైంది.  బస్సు బయలుదేరిన కొద్ది సమయానికి ఏసీ హోల్స్ నుంచి నీరు గారటం స్టార్ట్ అయింది.. సీట్లన్నీ నీటితో తడిచి ముద్దయి   ప్రయాణికులు నీటిలోనే ప్రయాణించవలసి వచ్చింద ని చెప్పారు ప్రయాణికులు... ఎంత మొత్తుకున్నా ఆరెంజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ యాజమాన్యం వారు పట్టించుకున్న దాఖలాలు లేవు అని ప్రయాణికుల...

సముద్రంలో అనంత్ అంబానీ - రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు!

Image
సముద్రంలో అనంత్ అంబానీ - రాధిక ప్రీ వెడ్డింగ్వేడుకలు! అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలుమొ దలయ్యాయి. ఓ లగ్జరీ నౌకలో 3 రోజులపాటువే డుకలు కొనసాగనున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు 4,380 కి.మీ మేర క్రూయిజ్ షిప్ప్రయాణించనుంది. మొత్తం 800మంది అతిథుల్లో సల్మాన్, షారుఖ్, ఆమిర్, రణ్ బీర్,ధో నీ వంటి సెలబ్రిటీలు ఉన్నారు. వీరందరికీసేవలుఅందించేందుకు 600 మంది సిబ్బంది ఉన్నారు. ఈపార్టీకి భారీగా ఖర్చు చేస్తున్నట్లు టాక్.

విశాఖ యువకుడికి రూ. కోటి స్కాలర్‌షిప్.. ఎంబీఏ సీట్ ఆఫర్ చేసిన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ

Image
 *విశాఖ యువకుడికి రూ. కోటి స్కాలర్‌షిప్.. ఎంబీఏ సీట్ ఆఫర్ చేసిన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ * విశాఖ నగరానికి చెందిన ఒబిలిశెట్టి శ్రీరామ్ వరుణ్ అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చోటు దక్కించుకున్నాడు. గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ స్థానాన్ని సాధించాడు. అంతేకాదు కోటి రూపాయల ఉపకార వేతనాన్ని కూడా పొందాడు. ఈ విషయాన్ని సగర్వంగా ఉన్నట్లు చెప్పారు శ్రీరామ్. అమెరికాలోని ఐవీ లీగ్ యూనివర్సిటీలో కూడా తనకు సీటు లభించిందని, అదే సమయంలో స్టాన్ ఫోర్డ్ వర్సిటీలో సీట్ రావడంతో అందులోనే చేరాలని నిర్ణయించుకున్నట్టు శ్రీరామ్ వరుణ్ తెలిపారు. దేశంలో చాలా తక్కువ మందికే స్కాలర్‌షిప్‌తో కూడిన సీటు లభిస్తుందని, రాష్ట్రం నుంచి తనకు ఈ అవకాశం లభించిందని శ్రీరామ్ వివరించారు. ఇంతటి ఘనత సాధించిన శ్రీరామ్ వరుణ్ తల్లిదండ్రులు ఎవరా అంటూ పెద్ద ఎత్తున సెర్చ్ ప్రారంభం అయింది. తండ్రి డాక్టర్‌ వి.రాజ్‌కమల్‌ ప్రస్తుతం విజయవాడ సిద్ధార్థ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో శస్త్ర చికిత్స విభాగ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వరుణ్ తల్లి డాక్టర్‌ సౌదామిని. ఈమె ప్రస్తుతం విశాఖలో ప్రముఖ గైన...

2 కొత్త వందేభారత్‌లు

Image
 2 కొత్త వందేభారత్‌లు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విశాఖపట్నం- సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడుస్తుండగా.. నేడు ఇదే మార్గంలో మరొకటి పట్టాలు ఎక్కనుంది. దీంతోపాటు ద.మ. రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురగి-బెంగళూరు వందేభారత్‌ రైలు, కొళ్లం-తిరుపతి మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

బిందెలో తలపెట్టిఇరుక్కున్న చిరుత...

Image
 

నేటి మధ్యాహ్నం కౌంట్ డౌన్ స్టార్ట్

Image
  GSLV F14 Launch: రేపు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-14 ప్రయోగం.. నేటి మధ్యాహ్నం కౌంట్ డౌన్ స్టార్ట్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్‌ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి రేపు (శనివారం) సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-14 రాకెట్‌ను ప్రయోగించేందుకు సిద్ధం అయ్యారు.. ఇవాళ (శుక్రవారం) మధ్యాహ్నం 2.05 గంటల నుంచి 27.30 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-14 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. మొత్తం 2,272 కిలోలు బరువు కలిగిన ఇన్‌శాట్‌-3 డీఎస్‌ ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలో మీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశ పెట్టేలా ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని డిజైన్‌ చేసినట్లు తెలిపారు. ఇది షార్‌ కేంద్రం నుంచి 92వ ప్రయోగం కాగా.. జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 16వ ప్రయోగం పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్‌ ఇంజిన్లు తయారు చేసుకుని చేస్తున్న 10 వ ప్రయోగం కావడం విశేషం అని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు..

75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగం

Image
 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసం గించారు. ఈ సందర్భంగా అయోధ్య రామ మందిరం, భారతరత్న పొందిన బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌ గురించి ప్రస్తావించారు. అయోధ్యలో మహిమాన్వితమైన రామ మందిర ప్రారంభోత్సవాన్ని ముర్ము ప్రశంసించారు. అయోధ్యను భారతదేశ నాగరికత వారసత్వానికి మైలురాయిగా చరిత్రకారులు భావిస్తారని చెప్పారు.  భారతరత్న అవార్డు పొందిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు ముర్ము నివాళులర్పించారు. సామాజిక న్యాయం కోసం ఆయన అవిశ్రాంతంగా పోరాడారని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం అవిశ్రాంతంగా పోరాడిన కర్పూరి ఠాకూర్‌ శత జయంతి ఉత్సవాలు ముగిశాయని పేర్కొన్న ముర్ము.. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.  ప్రజాస్వామ్యానికి తల్లి.. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పాశ్చాత్య ప్రజాస్వామ్య భావన కంటే  భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా పురాతనమైనదని చెప్పారు. భారతదేశం అమృత్‌కాల్ దశలో ఉందని పేర్కొన్న ముర్మ...

దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు..

Image
 దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు..  ఢిల్లీలో జరిగే పరేడ్ లో మొత్తం 25 శకటాల ప్రదర్శన..  మూడేళ్ల తర్వాత తొలిసారి రిపబ్లిక్ డే పరేడ్ లో తెలంగాణ శకటం..  డెమోక్రసి ఎట్ గ్రాస్ రూట్స్ పేరుతో తెలంగాణ శకటం..  తెలంగాణ శకటంపై చాకలి ఐలమ్మ, కొమురం భీం, రాంజీ గోండు విగ్రహాలు..  డిజిటల్ క్లాసుల థీమ్ తో ఏపీ శకటం..  ఏపీ విద్యావ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన మార్పులపై శకటం..  16 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాల శకటాల ప్రదర్శన..  గణతంత్ర వేడుకలకు ఢిల్లీలో భారీగా బందోబస్తు..

చంద్రికా రావి బ్యూటిఫుల్ లుక్ ఇన్ యెల్లో సారీ

Image