Posts

Showing posts with the label Health

మత్తుపదార్థాల వాడకం వల్ల

Image
  మత్తుపదార్థాల వాడకం వల్ల యువత చెడు పోతుందని డిసిపి సత్తిబాబు తెలియజేశారు. ఈ మేరకు గురువారం మాధవ దార లో గ్రాండ్ మిలన్ ఫంక్షన్ హాల్ లో యువకులతో కలిసి డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. డీసీపీ సత్తిబాబు మాట్లాడుతూ మత్తుపదార్థాల వాడకం వల్ల యువతి యువకులు చెడు పోతున్నారని అన్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా విద్యార్థులు మత్తు పదార్థాలు సేకరించడం ద్వారా తన భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని అన్నారు. అలాగే ఉద్యోగ అభివృద్ధి కేంద్రంలో మత్తుపదార్థాల వాడకం వల్ల వచ్చే రోగాలు, ఇతరత్ర అనర్ధాలు, తద్వారా యువత చెడు వైపుకు పయనిస్తుందని కూలంకుశంగా విద్యార్థినీ విద్యార్ధులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. రోజురోజుకి యువత  సమాజ అభివృద్ధి కోసం ప్రయణించాల్సి ఉండగా, చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారని, మత్తు పదార్ధాలు, ఇతరత్ర డ్రగ్స్కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన అన్నారు.సమాజానికి ఉపయోగపడే యువత చెడువైపు పయణిస్తే సమాజం అభివృద్ధి చెందకపోవడమే కాకుండా వారి కుటుంబాలు సైతం చిన్నాభిన్నం అవుతాయని. విద్యార్థులు, యువకులు ఈ విషయాన్ని గమనించి మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్య...

మత్తు పదార్థాలు బారిన పడవద్దు యువత భవిష్యత్తు చేయి జార్చుకోవద్దు

Image
  మత్తు పదార్థాలు బారిన పడవద్దు యువత భవిష్యత్తు చేయి జార్చుకోవద్దు అనే ఉద్దేశంతో పండగలు, ఫంక్షన్ లో సైతం వదలకుండా విస్తృతంగా మత్తు పదార్థాల నిర్మూలలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. గోపాలపట్నం ఎస్ ఐ రామకృష్ణ. మంగళవారం 89వ వార్డు చంద్ర నగర్ పరదేశమ్మ జాతర సందర్భంగా.అధిక సంఖ్యలో యువత హాజరవుతున్న సమయంలో గంజాయి మత్తు పదార్థాలు వాడవద్దు అది వాడితే మీ భవిష్యత్తు చిన్నాభిన్నమవుతుంది అంటూ.వాటికి అలవాటు పడి అనేక దొంగతనాలకు, దౌర్జన్యాలు చేసేందుకు పాల్పడతారు.మీ మతిస్థిమితం మీ అదుపులో ఉండదు అంటూ పలు అంశాలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు.మీరు నివసిస్తున్న ప్రాంతంలో మీకు కనబడిన ప్రదేశాల్లో గాని ఎవరైనా గంజాయి సేవించిన లేదంటే విక్రయించిన మాకు సమాచారం ఇవ్వండి అని తెలిపారు.ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.

కేజీహెచ్ లోని వైద్యాధికారులతో పరిచయ కార్యక్రమం లో

Image
 విశాఖపట్నం, జూన్ 17: కేజీహెచ్ లోని వైద్యాధికారులతో పరిచయ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున ,  కే జి హెచ్  సూపరింటెండెంట్ డా. శివానందం , ఏ ఎం సి ప్రిన్సిపాల్ బుచ్చి రాజు తో కలిసి పాల్గొన్న విశాఖ దక్షిణ నియోజకవర్గ నూతన  ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ .

గుండెపోటు రావడానికి మూడు గంటల ముందు కనిపించే లక్షణాలు

Image
గుండెపోటు రావడానికి మూడు గంటల ముందు కనిపించే లక్షణాలు. ప్రముఖ కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ చొక్కలింగం. అవగాహన రిజిస్ట్రేషన్ . ప్రసిద్ధ కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ చొక్కలింగం ప్రకారం:-      ఒకరికి హార్ట్ ఎటాక్ ఉందని అనుమానం ఉంటే, అతన్ని నడవడానికి అనుమతించకూడదు;  మెట్లు ఎక్కడం లేదా దిగడం లాంటివి అనుమతించకూడదు;  ఆటోలో ఆసుపత్రికి వెళ్లకూడదు. వీటిలో ఏ ఒకటి జరిగినా రోగి మనుగడకు కష్టతరం అవుతుంది. గుండెపోటు (హార్ట్ ఎటాక్)ని మూడు గంటల ముందుగానే పసిగట్టగల అవయవం మన మెదడు.   మన శరీర కార్యకలాపాల్లో చిన్నపాటి ఆటంకాలు ఏర్పడినా మెదడు వెంటనే అప్రమత్తం చేస్తుంది.   మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ జాగ్రత్తను అనుభవించడం కష్టం.    ఏదయిన ఒక వివాహ వేడుకలో, బహిరంగ ప్రదేశాల్లో లేదా ఇంట్లో ఒక పురుషుడు లేదా స్త్రీ పొరపాటున పడిపోతున్నట్లు కనిపిస్తే, మనం వెంటనే వారిపై దృష్టి పెట్టాలి. కానీ తనకు ఏమీ జరగలేదు, నేను బాగున్నాను అని వారు చెప్పవచ్చు మనం కూడా ఏదో పైత్యం అని తేలిగ్గా వదిలేయకూడదు.                       మెదడు ప్ర...

విశాఖ పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు సీఐ సమక్షంలో

Image
  విశాఖ పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు సీఐ సమక్షంలో విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం లో మల్కాపురం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ సనఉల్లాహ్ స్వీయ పర్యవేక్షణలో గురువారం తోటి సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.  సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఉష్ణతాపంతో ఇబ్బందులు ప్రతి ఒక్కరికి సర్వసాధారణమని సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ఈ కార్యక్రమం నిర్వహించమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్, క్రైమ్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం

Image
  ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం అమరావతి: రాష్ట్రంలో మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వానికి స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం తెలిపింది. ఈ మేరకు సోమవారం ఓ లేఖ రాసింది.. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో లక్ష్మీ షాకు రాసిన ఈ లేఖలో పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడాన్ని ప్రస్తావించింది. మే 22 నుంచి ఏపీలోని వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామని స్పష్టం చేసింది. గతేడాది ఆగస్టు నుంచి ఉన్న రూ.1,500 కోట్ల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేసింది.. సుదీర్ఘ కాలంగా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం తెలిపింది. పలుమార్లు లేఖలు రాసినా ఇప్పటివరకు కేవలం రూ.50 కోట్లు మాత్రమే చెల్లింపులు చేశారని లేఖలో పేర్కొంది..

పెరుగుతున్న గుండెపోటు మరణాలు

Image
  పెరుగుతున్న గుండెపోటు మరణాలు భారత్‌లో ఏటా అధిక రక్తప్రసరణతో వచ్చే గుండెపోటు, పక్షవాతంతో 16 లక్షల మంది చనిపోతున్నారు. ప్రపంచంలో సంభవించే మరణాలకు మొదటి ప్రధాన కారణం బీపీ ఎక్కువగా ఉండటమే. రెండో కారణం శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు, మూడోది డయేరియా, నాలుగోది ఎయిడ్స్, ఐదోది టీబీ, ఆరోది మలేరియా అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), భారతీయ వైద్య పరిశోధనా మండలి (ICMR), కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఉమ్మడి నివేదిక తేల్చి చెప్పింది.
Image
 *కొవిషీల్డ్ సురక్షితమే.. ఆందోళన వద్దు: ఆస్ట్రాజెనెకా* కొవిషీల్డ్ వ్యాక్సిన్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనెకా పేర్కొంది.  కాగా.. ఈ వ్యాక్సిన్తో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఇటీవల ఆస్ట్రాజెనెకా అంగీకరించడంతో టీకా తీసుకున్న వారిలో ఆందోళన మొదలైంది.  తాజాగా ఈ విషయంపై ఆస్ట్రాజెనెకా మళ్లీ స్పందించింది.  కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.  ప్రయోగ పరీక్షల్లో కొవిషీల్డ్ మంచి ఫలితాలు ఇచ్చిందని పేర్కొంది.

బిక్కుబిక్కుమంటున్న కోవీషీల్డ్ గ్రహీతలు

Image
 

కోవిషిల్డ్ కొంప ముంచింది..!

Image
ovishield Covid Vaccine: వామ్మో.. అనుకున్నదే జరిగింది.. కోవిషిల్డ్ కొంప ముంచింది..! Covishield Corona Vaccine: కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్నారా ? ఆ వ్యాక్సిన్‌.. కోవిషీల్డా..? అయితే అప్రమత్తంగా ఉండాల్సిందే. టీకాలు వేసుకున్నవారిని భయపెట్టే వార్తను బయటపెట్టింది.. ఆ వ్యాక్సిన్‌ను తయారు చేసిన ఆస్ట్రాజెనెకా. ఇంతకూ ఏంటా వార్త..? ఆ టీకాతో ముప్పేంటి..? వైద్య నిపుణులు ఏమంటున్నారు? అనేది చర్చనీయాంశంగా మారింది. ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా కోట్లమందిపై బాంబు పేల్చింది. తాము రూపొందించిన కొవిడ్​ 19 టీకాతో ఎలాంటి ఇబ్బందులు లేవని ఇంతకాలం చెబుతూ వచ్చిన ఆ సంస్థ..ఇప్పుడు అసలు విషయం అంగీకరించింది. కోవిషీల్డ్ టీకా అరుదైన సందర్భాల్లో థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్-TTSకు కారణమవుతుందని తెలిపింది. టీటీఎస్‌వల్ల కొంతమందికి రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్ కౌంట్‌ పడిపోవటం వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే ఈ విషయాన్ని అంగీకరించేందుకు ఆస్ట్రాజెనెకాకు 3ఏళ్లు పట్టింది. ప్రజలకు వ్యాక్సిన్లు వేసిన ఇన్నేళ్ల తరువాత తొలిసారిగా ఇన్​-కోర్ట్​ డాక్యుమెంట్స్​లో ఈ విషయాన్ని అ...