Posts

Showing posts with the label Andhra

పప్పుధాన్యాలు, వరి, బియ్యం నిల్వల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి

Image
 **పప్పుధాన్యాలు, వరి, బియ్యం నిల్వల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి** **ప్రతి శుక్రవారం వెబ్‌సైట్లలో నిల్వల వివరాలు నవీకరించాలి** చిలకలూరిపేట.. పప్పుధాన్యాలు, వరి, బియ్యం నిల్వల వివరాలను సంబంధిత ప్రభుత్వ వెబ్‌సైట్లలో తప్పనిసరిగా నమోదు చేయాలని పల్నాడు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎం.వి. ప్రసాద్ వ్యాపారులకు సూచించారు. జిల్లాలోని దిగుమతిదారులు, మిల్లర్లు, టోకు, చిల్లర వ్యాపారులు, నిల్వదారులు తమ వద్ద ఉన్న నిల్వల వివరాలను కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్లలో నమోదు చేయాలని తెలిపారు. కందిపప్పు, మినుములు, శనగలు, మసూర్ పప్పు, పెసలు, పసుపు బఠానీలతో పాటు వరి, ముడి బియ్యం, ఉడికించిన బియ్యం, నూకల నిల్వల వివరాలను నమోదు చేయాలన్నారు. పప్పుధాన్యాల నిల్వల కోసం https://fcainfoweb.nic.in/psp/ వెబ్‌సైట్‌లో, వరి, బియ్యం నిల్వల కోసం https://foodstock.dfpd.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపరచాలని సూచించారు. నమోదు చేసిన నిల్వల వివరాలను ప్రతి శుక్రవారం తప్పనిసరిగా నవీకరించాలని స్పష్టం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వెబ్‌సైట్లలో నమోదైన వివరాలను వాస్తవ నిల్వలతో సరిపోల్చి పరిశీలిస్తారని తెలిపార...

ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం.. ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు

Image
 ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం.. ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు **పునరుద్ధరిస్తామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో కానరాని సేవలు.. మరో తుఫాను హెచ్చరికతో ఆందోళన* చిలకలూరిపేట  News9 ... ప్రజా సమస్యల పరిష్కార వెలుగు పట్టణంలో తుఫాను ప్రభావంతో నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలను కొన్ని ప్రైవేటు సంస్థలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో పునరుద్ధరించక పోవడంతో చందాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటర్నెట్‌పై ఆధారపడిన విద్యార్థులు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులు, చిరు వ్యాపారులు సేవలు అందుబాటులో లేక నష్టపోతున్నారు.ఈ సమస్యపై సంబంధిత సంస్థల కాల్ సెంటర్లకు ప్రతిరోజూ వందలాది మంది వినియోగదారులు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నప్పటికీ, సేవలను త్వరలోనే పునరుద్ధరిస్తామని చెబుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మారడం లేదని చందాదారులు వాపోతున్నారు. ముఖ్యంగా విద్యార్థుల పరీక్షలు, ఆన్‌లైన్ తరగతులు, వ్యాపార లావాదేవీలు, ఉద్యోగుల విధులకు ఆటంకం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సమస్యను కొంతమంది వినియోగదారులు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) దృష్టికి తీసుకెళ్లగా, మరికొందరు జాతీయ వినియోగదారుల హెల్ప...

*చిలకలూరిపేట పట్టణంలోని AMG ప్రాంగణంలో కౌంటింగ్ ఏరియాలో పరిస్థితి*

Image
 *చిలకలూరిపేట పట్టణంలోని AMG ప్రాంగణంలో కౌంటింగ్ ఏరియాలో పరిస్థితి*

వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించాలి

Image
 వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించాలి నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించాలి కరపత్రాలు పంపిణీ చేసిన కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం నాయకులు చిలకలూరిపేట news9 వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం నాయకులు సూచించారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని, వినియోగదారుల హక్కులను పరిరక్షించాలని కోరుతూ శనివారం స్థానిక నరసరావుపేట సెంటర్‌లో ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయని, దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ధరల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసి ధరలను అదుపులో ఉంచాలని కోరారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం–2019 ప్రకారం ప్రతి ఒక్కరికీ భద్రత, వస్తువుల నాణ్యతపై సమాచారం పొందడం, ఎంపిక చేసుకోవడం, ఫిర్యాదు చేయడం, నష్టపరిహారం పొందడం వంటి హక్కులు ఉన్నాయని వివరించారు. వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, ప్యాకింగ్‌పై ఉన్న బరువు, ధర, తయారీ వివరాలను పరిశీలించాలని సూచించారు. బస్తాలపై ప్రకటించిన బరువుకు అన...

విజయవాడ మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ కి తిరుగులేదు :: గాది రెడ్డి ఝాన్సీ రాణి

Image
 విజయవాడ మేయర్ అభ్యర్థి  వంగవీటి రాధాకృష్ణ కి తిరుగులేదు :: గాది రెడ్డి ఝాన్సీ రాణి   విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలలో జనసేన పార్టీ తరఫున పోటీ చేయుచున్న అభ్యర్థులందరికి మంచి స్పందన ఎదురవుతున్నది.  ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అన్నినెరవేరుస్తున్నాము  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఆంధ్ర రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని.  అమరావతి తో పాటు విజయవాడ కూడా అభివృద్ధి చెందాలంటే వంగవీటి రాధాకృష్ణ ను మేయర్ గా గెలిపించుకోవాలని.  అలాగే 22 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నన్ను గాజు గ్లాసు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని ఆమె అన్నారు.  వంగవీటి ఫ్యామిలీ ఎప్పుడు తనను నమ్మి వచ్చిన వారి కి అందరికీ అండగా ఉంటారు:: గాదిరెడ్డి అమ్ములు   గత చరిత్రలో చూసుకున్నట్లయితే వంగవీటి రాధాకృష్ణ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు రాణి గారి తోట వాసులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.  అలాగే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క కంప్లైంట్ కూడా లేని ఏకైక ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ.  అలాంటి వంగవీటి ఫ్యామిలీ...

విజయవాడ నగర అభివృద్ధి మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కి నా సవాల్ :: మమ్మనేని ప్రసాద్

Image
 విజయవాడ నగర అభివృద్ధి మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కి నా సవాల్ :: మమ్మనేని ప్రసాద్   వైసీపీ హయాంలో ఉన్నప్పుడు నగరపాలక సంస్థను బ్రష్టు పట్టించింది మీరు కదా.  నగరంలో మంచి నీటి సమస్యకు కారణం మీరు కదా. కౌన్సిల్ జరిగేటప్పుడు అర్థమంతమైన చర్చను ఏనాడైనా జరిపారా.  కౌన్సిల్ నిర్వహణలో మీరు పూర్తిగా విఫలం చెందారు.  ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు అందుకనే మిమ్మల్ని ఓడించి 11 సీట్లకు పరిమితం చేశారు.  19 వ డివిజన్ నుండి గత కొన్ని సంవత్సరాలకు కార్పొరేటర్ గా నేను పనిచేస్తున్నాను. ఇక్కడి ప్రజల అవసరతలు నాకు బాగా తెలుసు.  సైకిల్ గుర్తుపై ఓటు వేసి కార్పొరేటర్ గా నన్ను గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి వంగవీటి రాధాకృష్ణను గెలిపించవలసినదిగా కోరుకుంటున్నానని అన్నారు.

రాధ కృష్ణ జన్మ దిన వేడుకలు

Image
 *ఎన్టీఆర్ జిల్లా విజయవాడ*  *రాధ కృష్ణ జన్మ దిన వేడుకలు**  విజయవాడ వెటర్నరీ కాలనీ లో రాధ కృష్ణ జన్మదిన సందర్భంగా " సి ఆర్ కే లా ఛాంబర్స్ "ఆఫీసు ప్రాంగణం నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది.. 49వ డివిజన్ బిజెపి కార్యాలయం నందు అడ్డూరి శ్రీరామ్ చేతుల మీదుగా హైకోర్టు లాయర్ మరియు "సి ఆర్ కే లా ఛాంబర్" అధినేత సి రాధాకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు మరియు ఆయన అభిమానులకు  పేదలకు పండ్లు మరియు స్వీట్స్ పంచడం జరిగింది  ..

డా. శంకరరావు కొచ్చెర్ల కు డా. ఏ.పీ.జే. అబ్దుల్ కలాం జాతీయ విద్యావేత్త పురస్కారం

Image
డా. శంకరరావు కొచ్చెర్ల కు డా. ఏ.పీ.జే. అబ్దుల్ కలాం జాతీయ విద్యావేత్త పురస్కారం పార్వతీపురం మన్యం జిల్లా, ఆంధ్రప్రదేశ్. అరుణోదయ యూనివర్సిటీలో పరిశోధన మార్గదర్శకులుగాh సేవలందిస్తున్న డా. శంకరరావు కొచ్చెర్ల గారికి ప్రతిష్ఠాత్మకమైన డా. ఏ.పీ.జే. అబ్దుల్ కలాం జాతీయ విద్యావేత్త పురస్కారం (Dr. A. P. J. Abdul Kalam National Academician Award) లభించింది. WELRED FOUNDATION సంస్థ ఈ పురస్కారాన్ని ఆయనకు అందించింది. విద్యారంగంలో ఆయన చేసిన కృషి, పరిశోధన మార్గదర్శకత్వంలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. విద్యా ప్రమాణాల అభివృద్ధి, పరిశోధన మార్గదర్శకత్వం, యువత సాధికారత, సమాజ అభివృద్ధి పట్ల డా. కొచ్చెర్ల గారు చూపుతున్న నిబద్ధతకు ఈ పురస్కారం గుర్తింపుగా నిలుస్తుంది. విద్యావేత్తగా, సామాజిక నాయకుడిగా ఆయన విద్యార్థులను ప్రోత్సహించడం, విద్యావకాశాలను మెరుగుపరచడం, సమాజ అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలను ప్రోత్సహించడం వంటి అంశాల్లో భాగస్వామిగా ఉన్నారు. స్టూడెంట్ సక్సెస్ సొసైటీ (Student Success Society) అధ్యక్షుడిగా డా. శంకరరావు కొచ్చెర్ల గారు విద్యార్థుల విజయానికి తోడ్పడటం, విద్యపై అవగాహన పె...

వినాయక చవితి వేడుకలలో భాగంగా సురేష్ ఫ్రెండ్ సర్కిల్ ,సిరినగర్ భక్త బృందం ఆధ్వర్యంలో

Image
 *ఎన్టిఆర్ జిల్లా విజయవాడ* వినాయక చవితి వేడుకలలో భాగంగా సురేష్ ఫ్రెండ్ సర్కిల్ ,సిరినగర్ భక్త బృందం ఆధ్వర్యంలో  17వ సంవత్సరాలుగా అత్యంత వైభవంగా ఈ సిరి నగర్ లో ఏర్పాటు చేయడం జరుగుతుందని  ఏమూరి సురేష్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు ప్రవీణ్ అన్నారు. *వేమూరి సురేష్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు ప్రవీణ్ కామెంట్స్*: ఈ సంవత్సరం 8 కళ్యాణాలు,5 అభిషేకాలు,ఈ రోజు స్వామివారి అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ అన్న ప్రసాదం కు  దాదాపుగా 30 వేల నుంచి 35 వేల మంది వరకు రావడం జరిగింది  అన్న ప్రసాదం కు వచ్చిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.  రేపు ఉదయం స్వామి వారి పూజ అనంతరం స్వామి వారు ఊరేగింపు నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయి. రేపు 125 కేజీల లడ్డు వేలం,బురతకల్పం, గోదారంగనాథ స్వామి,వెంకటేశ్వర స్వామి,సీతారాముల కళ్యాణం,సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఉంటుంది  సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలు మన దక్షిణాది మద్రాసులో ఎక్కువగా చేయడం జరుగుతుంది మద్రాస్ లో ఎక్కువగా కావేడి ఉత్సవాలు చేస్తారు  కావేడీ ఉత్సవం పురవీధుల్లో ఊరేగింపు కావడంతో  350 ...

గాంధీ జయంతి సందర్భంగా

Image
మన్యం జిల్లా సాలూరులో ఈ.  రోజు గాంధీ జయంతి సందర్భంగా రాజన్నదొరగారు  మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు   వేసి నివాళులర్పించారు...

మాంసపు దుకాణాలు బంద్

Image
 *గాంధీ జయంతి సందర్భంగా మాంసపు దుకాణాలు బంద్* *కఠిన చర్యలు తప్పవన్న కమిషనర్ పి శ్రీహరి బాబు* చిలకలూరిపేట పట్టణంలో రేపు గాంధీ జయంతిని పురస్కరించుకుని మున్సిపల్ పరిధిలోని మాంసపు దుకాణాలు, మాంసాహారం విక్రయించే రెస్టారెంట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదని మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూమాంసం విక్రయాలు నిలిపివేయాలని ఇప్పటికే సంబంధిత వ్యాపారులందరికీ ముందస్తు నోటీసులు అందజేశామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా దుకాణాలు తెరిచినా, మాంసం అమ్మకాలు చేపట్టినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ పి. శ్రీహరి బాబు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. గాంధీ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలను తూచా తప్పకుండా పాటించి మున్సిపల్ యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు.

శ్రీ శ్రీ ముగడా లమ్మ తల్లి పండగ సందర్భంగా

Image
 ఈరోజు సాయంత్రం బలిజిపేట మండలం పలగర గ్రామం  పలగర వారాలు   శ్రీ శ్రీ శ్రీ ముగడా లమ్మ తల్లి పండగ సందర్భంగా ఆ తల్లికి మొక్కులు చెల్లించుకొని  తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు

గత 3 రోజుల వర్షం తర్వాత

Image
 గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు *వైజాగ్ రిజర్వాయర్లు దాదాపు నిండిపోయాయి.* 💧 IMD చెప్పిన ప్రకారం ఈ వాయుగుండం నిన్న రాత్రి (23వ తేదీ రాత్రి నుండి 24వ తేదీ తెల్లవారుజామున) కళింగపట్నం - పోలాకి మధ్య తీరం దాటింది, గంటకు 55-65 కి.మీ వేగంతో గాలులు, ఒక్కోసారి 75 కి.మీ వరకు వీచాయి. 24 గంటల్లో 80 ప్రాంతాల్లో 100mm కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. *GVMC రిజర్వాయర్లపై ప్రభావం:* ఈ వర్షం సరైన సమయంలో వచ్చింది - ఆగస్టు 2026లో భూగర్భ జలాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆగస్టులో వైజాగ్‌లో 47.89% వర్షాభావం ఉంది. 5 రోజుల క్రితం వరకు రాయివాడలో 3.6 TMC సామర్థ్యానికి కేవలం 0.9 TMC మాత్రమే ఉంది, మేఘాద్రిగెడ్డలో 1.17 TMC కి 0.2 TMC మాత్రమే, తాటిపూడిలో 3.3 TMC కి 1.2 TMC మాత్రమే ఉంది. *గత 3 రోజుల వర్షం తర్వాత:* - *రాయివాడ:* పూర్తి స్థాయి 114 మీటర్లకు గాను 112.95 మీటర్లకు చేరుకుంది, అధికారులు 3 గేట్లు ఎత్తి శారదా నదిలోకి 9000 క్యూసెక్కులు విడుదల చేశారు - *మేఘాద్రిగెడ్డ:* భారీగా వరద నీరు వచ్చి, అదనపు నీటిని విడుదల చేశారు - *తాండవ / వరాహ / అనకాపల్లి ఇతర రిజర్వాయర్లు:* దాదాపు నిండిపోయాయి - తాండవ 380 అడుగుల పూర్తి స...

అగ్ని వన్యకుల క్షత్రియుల బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లాడి రాజేష్

Image
 *ఎన్టీఆర్ జిల్లా విజయవాడ*  *అగ్ని వన్యకుల క్షత్రియుల బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లాడి రాజేష్*  విజయవాడ పరిసర ప్రాంతాలు ఏదైతే తీసుకుంటే బీసీ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం క్షత్రియలకి అన్యాయం జరుగుతుంది  మమ్మల్ని ఏ రాజకీయ నాయకులు కూడా పట్టించుకోవడం లేదు  ప్రతిసారి రాజకీయ నాయకులు గెలిపించుకోవడంలోనే మేము ముఖ్యపాత్ర పోషిస్తున్నాము  ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానంలో ప్రతి సంవత్సరం శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి  ఉత్సవాలలో పోయిన సంవత్సరం 90 మందికి ఉత్సవ భారత మండలి ఏర్పాటు చేస్తే అందులో మా సామాజిక వర్గం   అగ్నివన్య కులక్షత్రియ సామాజిక వర్గం నుండి ఒకరిని కూడా తీసుకోవడం చాలా బాధాకరం మమ్మల్ని సేవా కార్యక్రమానికి కూడా అవకాశం కల్పించట్లేదు   4 కార్పొరేషన్ ఎన్నికలు జరగడం జరిగింది   ఈ నాలుగు కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అక్కినేని కుల క్షత్రియులు జనాభా ఎక్కువ ఉన్నటువంటి  కండ్రిక పైపుల రోడ్డు బాంబే కాలనీ రాణి గారి తోట సింగనగర్ సామామూర్తి రోడ్డు గాంధీనగర్ కృష్ణలంక పడమట లంగా లు సెంటర్ భవానిపురం గొల్లపూడి ఇ...

పార్వతీపురం మన్యం జిల్లాసాలూరు లోభారీ వర్షం

Image
 పార్వతీపురం మన్యం జిల్లాసాలూరు లో ఈవెనింగ్ 6గంటల నుంచి అతి పెద్ద భారీ వర్షం చోటుచేసుకుంది

సాలూరు స్థానిక మున్సిపల్ ఎన్నికల 32 వార్డులు సమావేశం

Image
ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు స్థానిక మున్సిపల్ ఎన్నికల   32 వార్డులు సమావేశం డిప్యూటీ సిఎం  రాజన్నదొరగారు హయం లో జరిగింది ఈ 32 వార్డుల సమావేశంలో ప్రజలకు టీడీపీ చేసిన అన్యాయాలు పథకాలు  ఇస్తామని చెప్పి అబద్ధాలు గురించి చెప్పడం జరిగింది  

నో బ్యాగ్ డేలో వినియోగదారుల అవగాహన కార్యక్రమాలు

Image
 నో బ్యాగ్ డేలో వినియోగదారుల అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో తప్పనిసరిగా అమలు చేయాలి. మురికిపూడి ప్రసాద్  సిఆర్పిఎఫ్ఐ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ చిలకలూరిపేట..... ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నిర్వహించే ‘‘నో బ్యాగ్ డే’’ సందర్భంగా వినియోగదారుల క్లబ్‌ల ద్వారా ప్రతి నెలా వినియోగదారుల రక్షణ, హక్కులు, బాధ్యతలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసిందని సీఆర్ఫీఎఫ్ఐ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మురికిపూడి ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు పౌర సరఫరాల కమిషనర్ కె.కన్నబాబు ఐఏఎస్ సెప్టెంబర్ 11న అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులు, జిల్లా విద్యాశాఖాధికారులకు సూచనలు జారీ చేసినట్లు ఆయన వివరించారు. గతంలో జూలై 30న జారీ చేసిన ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వినియోగదారుల క్లబ్‌ల ద్వారా నెలవారీ కార్యక్రమాల క్యాలెండర్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని స్పష్టం చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు వినియోగదారుల హక్కులు, బాధ్యతలు, వినియోగదారుల రక్షణ చట్టాలు, మోసాలు, నాణ్యత ప్రమాణాలు తదితర అంశాలపై అవగాహన కల్పించడమే కార్యక్రమాల ప్రధాన ఉ...

సాలూరు పట్టణంలో అక్రమ కట్టడాలు

Image
 

మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది

Image
 మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది  కార్పొరేషన్లలో మేయర్లు, కార్పొరేటర్ల ఎన్నికల నియమావళిని ఖరారు చేస్తూ GO 211 జారీ చేసింది.  నామినేషన్ డిపాజిట్ జనరల్ అభ్యర్థులకు ₹5K, SC, ST, BCలకు ₹2,500గా ఫిక్స్ చేసింది.  ఒక అభ్యర్థి 4 సెట్ల నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంటుంది.  నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతపై అఫిడవిట్ తప్పనిసరిగా జత పరచాలి.

SIR Corrctions...

Image
 ఈ రోజు సాలూరు కోటవీధి లో ఓటింగ్  వ్యక్తులు  నేమ్స్ అడ్రస్ తప్పు ఒప్పులు చేయడం జరిగింది ఈ కార్యక్రమం1వార్డు  సచివాలయం సెక్రెటరీ మనోహర్ గారుమున్సిపల్  deo గారు చిన్ని గారు దగ్గరుండి ఈ కార్యక్రమం జరిపించారు