Posts

Showing posts with the label accidents

రెండు ఆటోలు ఢీ.... నలుగురు కి తీవ్ర గాయాలు

Image
 *రెండు ఆటోలు ఢీ.... నలుగురు కి తీవ్ర గాయాలు*  చిలకలూరిపేట న్యూస్9 చిలకలూరిపేట -నరసరావుపేట రాష్ట్ర రహదారి పై రోడ్ ప్రమాదం జరిగింది.ఎదురుదుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్నాయి. పట్టణం లోని గుండయ్య తోట కు చెందిన వారు ఆదివారం నెమలిపూరి వెళ్లి తిరిగి వస్తున్నా సమయం లో నరసరావుపేట రోడ్ భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఎదురు గా వస్తున్న ఆటో వీరి ఆటోను ఢీ కొంది.ఈ ప్రమాదం లో రెండు ఆటోలు ముందు భాగం పూర్తి గా ద్వాంస మైంది.ఘటన స్థలానికి చేరుకున్న చిలకలూరిపేట అర్బన్ పోలీస్ లు గాయపడిన వారిని ఆసుపత్రి కి తరలించారు.ప్రాందానికి కారణమైన ఆటో డ్రైవర్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు.ప్రమాదం జరగడం తో ట్రాఫిక్ కొంతమేరానిలిచిపోయింది.పోలీస్ లు ట్రాఫిక్ ను క్లియర్ చేసి వాహన దారులకు ఇబ్బందులు లేకుండ చర్యలు తీసుకున్నారు.

శభాష్ ఖాకీ...ఇది కదా డ్యూటీ అంటే..*

Image
 *శభాష్ ఖాకీ...ఇది కదా డ్యూటీ అంటే..* చుట్టూ చీకటి.. అర్థరాత్రి 11.21 అతి తక్కువ సమయం.. రెండు జిల్లాల దూరం... కాపాడాల్సిన ఒక నిండు ప్రాణం... మూడు ఖాకీలు ఒక్కటైన తరుణం.. ఆపై విజయం...  " 6 నిమిషాల్లో అయినవిల్లి నుంచి అన్నవరం ". సెల్ఫీ వీడియో పెట్టి ఆత్మహత్య చేసుకుందామనుకున్న వ్యక్తిని 6 నిమిషాల్లో కాపాడిన పోలీసులు.  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కు చెందిన యువకుడు సెల్ఫీ వీడియో పెట్టి చనిపోయేందుకు సిద్ధమైన వైనం...   వివరాల్లోకి వెళితే కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంకు చెందిన వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో చనిపోదామని నిర్ణయించుకున్నాడు.  ఆ తర్వాత తనకు కావలసిన బంధువులకి సెల్ఫీ వీడియో పెట్టి ఉరి వేసుకుని చనిపోదామని నిర్ణయించుకున్న సమయంలో పి.గన్నవరం సీ.ఐ భీమరాజుకు వచ్చిన సమాచారం మేరకు వెంటనే అతను ఫోన్ నెంబర్ ని ట్రేస్ చేయడం కోసం ఐటీ కోర్ లో పనిచేస్తున్న జాఫర్ కు పంపించడం జరిగింది.  వెంటనే స్విచ్ ఆఫ్ లో ఉన్న మొబైల్ ను క్రెడియన్షియల్స్ ఉపయోగించి సెల్ ఐడి తో లాస్ట్ లొకేషన్ ను కనుగొన్న జాఫర్.  వెంటనే ఆ లొకేషన్ ను సీ.ఐ భీమరాజుకు షేర్ చేయడం జరిగింది.  వెంటన...

కృష్ణాజిల్లా.. పెనమలూరు నియోజకవర్గం. ప్రమాదవశాత్తు కిందపడి ఒకరు మృతి

Image
 కృష్ణాజిల్లా.. పెనమలూరు నియోజకవర్గం. ప్రమాదవశాత్తు కిందపడి ఒకరు మృతి  ఉయ్యూరు లోని కెసిపి షుగర్ ఫ్యాక్టరీకి లోడు తీసుకువచ్చిన మన్నే సురేంద్రబాబు (21) ప్రమాదవశాత్తు సైడ్ దిమ్మపై పడి మృతి.  ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు హత్య కావింపబడ్డాడని మృతిని బంధువుల ఆందోళన. కెసిపి ఎదురుగా రోడ్డుపై రాస్తారోకో.. న్యాయం చేయాలి అంటూ నినాదాలు.. కెసిపి యాజమాన్యం స్పందించాలని తమకు న్యాయం చేయాలని బంధువుల ఆందోళన.. స్పందించని యాజమాన్యం.

మనస్సు శరీరం ఒకటిగా చేసుకుంటూ వాహనం నడపాలి* డిసిపి కృష్ణమూర్తి నాయుడు

Image
 డీటీసీ కార్యాలయం, విజయవాడ తేదీ: 23-01-2024 *మనస్సు శరీరం ఒకటిగా చేసుకుంటూ వాహనం నడపాలి* డిసిపి కృష్ణమూర్తి నాయుడు *మార్పు రావాలంటే విద్యార్థులతోనే సాధ్యం* డీటీసీ ఎ మోహన్  స్థానిక కానూరు లోని వి ఆర్ సిద్ధార్ద ఇంజనీరింగ్ కాలేజీ లో  “లార్జ్ అర్బన్ ఎరియా ట్రాఫిక్ వాలంటీరింగ్ వారోత్సవాల ముగింపు కార్యక్రమంను గురువారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిసిపి కృష్ణమూర్తి నాయుడు, డీటీసీ ఎ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిసిపి కృష్ణమూర్తి నాయుడు మాట్లాడుతూ వాహనాలను నడిపేటప్పుడు మనస్సు శరీరం ఒకటిగా చేసుకుంటూ  వాహనం నడపడంపై దృష్టి పెట్టాలన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతిఒక్కరు హెల్మెట్ ను కారు నడిపేవారు సీట్ బెల్ట్ ని ధరించే వాహనాలను నడపాలన్నారు. హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించని వాహనదారులపై కేసులు నమోదుచెయ్యడంతో పాటు మోటార్ వాహన చట్టాలపై ప్రజలలో అవగాహన కల్పించడం కూడా ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.  డీటీసీ ఎ మోహన్ మాట్లాడుతూ రోడ్డు భద్రతపై విద్యార్థి దశలోనే అవగాహన  కల్పించాలని అప్పుడే ట్రాఫిక్ నిబంధనలపై ప్రతి ఒక్కరుకు అవగాహన పెరుగుతుందని ఆయన అన్నారు. కళా...

మృతురాలు కుమ్మరిపాలెం వాసిగా గుర్తింపు

Image
  *సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ వీధిలో ప్రమాదం*   *కాంక్రీట్ పనికి వచ్చి మృత్యువాత*   *మృతురాలు కుమ్మరిపాలెం వాసిగా గుర్తింపు*   *షణ్ముఖ వెలుగు సూళ్లూరుపేట*   బ్రతుకు జీవనం కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి సూళ్లూరుపేట బజారులో పని నిమిత్తం వచ్చిన కుమ్మరిపాలెం గ్రామస్తురాలు  ఎర్రబోతు ఇందిరమ్మ భర్త చెంచురామయ్య శనివారం ఉదయం సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ వీధిలో ఒక ఇంటికి స్లాబ్ పోయాల్సిన పని నిమిత్తం వచ్చి అక్కడే ఉన్న మిల్లర్ కు తన  చీర, వెంట్రుకలు చుట్టుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.

మీద పిడుగు పడి

Image
  అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గాదిరాయి గ్రామానికి చెందిన వడ్డాది భవాని శంకర్ (25) పొలంలో విత్తనాలు జళ్లడానికి వెళ్లి తిరిగి వస్తుండగా వర్షం పడు తుండడంతో పాకలోకి చేరగా పాక మీద పిడుగు పడి మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో తండ్రి కుమారులకు గాయాలు

Image
  *రోడ్డు ప్రమాదంలో తండ్రి కుమారులకు గాయాలు*    దొరవారిసత్రం మండల పరిధిలోని   కుప్పారెడ్డిపాలెం గ్రామ సమీపంలో     మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు చోటు చేసుకున్నాయి.  స్థానికులు వివరాలు మేరకు వాకాడు గ్రామానికి చెందిన పుచ్చలపల్లి కిరణ్ కుమారుడు సందీప్ లు అత్తగారి ఊరైన ఉగ్గు మూడికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో కుప్పారెడ్డిపాలెం సమీపంలో  సూళ్లూరుపేట నుండి నాయుడుపేట వైపు వెళుతున్న కారు అదుపుతప్పి ఢీకొంది.  ఈ ప్రమాదంలో తండ్రి కిరణకు, కుమారుడు సదీప్ కు తీవ్ర గాయాలు తగిలాయి.వీరిని చికిత్స నిమిత్తం  108 లో  నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడనుండి మెరుగైన వైద్యం కొరకు  స్థానికులు తెలిపారు.  విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు  నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సుళ్ళురుపేట నుంచి పేర్నాడు కొరిడికి కి వెళ్లే బస్సుకు తృటిలో పెను ప్రమాదం

Image
*సుళ్ళురుపేట నుంచి పేర్నాడు కొరిడికి కి వెళ్లే బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. అసలే బస్సు రద్దీగా ఉంది టీచర్స్ హాస్పిటల్స్ సిబ్బంది తొ ప్రయాణికులతో సూళ్లూరుపేట నుంచిబయలుదేరిన బస్సు పేర్నర్ రోడ్ లో ఒకసారి గా అదుపు తప్పింది. డ్రైవర్ చాకచక్యంగా బస్సు ఆపి ప్రయాణికులను కిందకు దించారు. ఎలాంటి నష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి*

గుండెపోటు రావడానికి మూడు గంటల ముందు కనిపించే లక్షణాలు

Image
గుండెపోటు రావడానికి మూడు గంటల ముందు కనిపించే లక్షణాలు. ప్రముఖ కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ చొక్కలింగం. అవగాహన రిజిస్ట్రేషన్ . ప్రసిద్ధ కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ చొక్కలింగం ప్రకారం:-      ఒకరికి హార్ట్ ఎటాక్ ఉందని అనుమానం ఉంటే, అతన్ని నడవడానికి అనుమతించకూడదు;  మెట్లు ఎక్కడం లేదా దిగడం లాంటివి అనుమతించకూడదు;  ఆటోలో ఆసుపత్రికి వెళ్లకూడదు. వీటిలో ఏ ఒకటి జరిగినా రోగి మనుగడకు కష్టతరం అవుతుంది. గుండెపోటు (హార్ట్ ఎటాక్)ని మూడు గంటల ముందుగానే పసిగట్టగల అవయవం మన మెదడు.   మన శరీర కార్యకలాపాల్లో చిన్నపాటి ఆటంకాలు ఏర్పడినా మెదడు వెంటనే అప్రమత్తం చేస్తుంది.   మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ జాగ్రత్తను అనుభవించడం కష్టం.    ఏదయిన ఒక వివాహ వేడుకలో, బహిరంగ ప్రదేశాల్లో లేదా ఇంట్లో ఒక పురుషుడు లేదా స్త్రీ పొరపాటున పడిపోతున్నట్లు కనిపిస్తే, మనం వెంటనే వారిపై దృష్టి పెట్టాలి. కానీ తనకు ఏమీ జరగలేదు, నేను బాగున్నాను అని వారు చెప్పవచ్చు మనం కూడా ఏదో పైత్యం అని తేలిగ్గా వదిలేయకూడదు.                       మెదడు ప్ర...

కారుని ఢీ కొన్న బొగ్గు లారీ

Image
 విశాఖ కారుని ఢీ కొన్న బొగ్గు లారీ తృటిలో తప్పిన ప్రమాదం పోర్ట్ కనెక్టివ్ ఫ్లై ఓవర్ పైన చోటు చేసు కున్న ఘటన ప్రమాద సమయంలో కారులో ప్రయానిస్తున్న నలుగురు వ్యక్తులు నగరం నుండి సిందియా వైపు వెళ్తున్న సమయంలో జరిగిన ప్రమాదం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

సెంట్రీ డ్యూటీలో మహిళా కానిస్టేబుల్ మృతి

Image
 *సెంట్రీ డ్యూటీలో మహిళా కానిస్టేబుల్ మృతి* *రాయచోటి* అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సెంట్రీ డ్యూటీలో ఉన్న వేదవతి(26) అనే మహిళా కానిస్టేబుల్ గన్నుతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే గన్నుతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుందా లేక గన్ను మిస్ ఫైర్ అయ్యి మృతి చెందిందానే విషయము తెలియాల్సి ఉంది.భర్త పేరు దస్తగిరి ఆయన సొంత ఊరు మదనపల్లి.వేదవతి సొంత ఊరు పుంగనూరు దగ్గర బింగానిపల్లె.దస్తగిరి పుంగనూరులో పోలీస్ అకాడమీ కోచింగ్ సెంటర్ లో ప్యాకల్టీగా పనిచేస్తూ అక్కడ వేదవతి ట్రైనింగ్ తీసుకునే సమయంలో ఇద్దరు ప్రేమించుకుని 2016 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు.వేదవతి చిత్తూరులో కానిస్టేబుల్ గా పనిచేస్తూ సంవత్సర క్రితం బదిలీపై అన్నమయ్య జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చింది. ప్రస్తుతం దస్తగిరి తో కలిసి వేదవతి రాయచోటి పట్టణంలోని రాజీవ్ స్వగృహకు పక్కనగల ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటోంది.ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం సెంట్రీ డ్యూటీలో ఉన్న వేదవతి గన్ను తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుందా లేక గన్ మిస్సయిర్ అయి మృతి చెందింది అనే విషయం తెలియాల్సి ఉంది.ఈ మేరకు డిఎస్పి రామచంద్రరావుఅర్...

గీతం కాలేజీ దగ్గర బైక్ ఆక్సిడెంట్

Image
 గీతం కాలేజీ దగ్గర బైక్ ఆక్సిడెంట్ జరిగింది.... పూర్తి వివరాలు తెలియవలసి ఉంది self accident Duke bike ap31eg1456

కొయ్యూరు: మండలంలోని చింతవానిపాలెం ఘాట్ లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం

Image
  కొయ్యూరు: మండలంలోని చింతవానిపాలెం ఘాట్ లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి చెందారు. అడ్డతీగల మండలంలోని సీతారాం గ్రామానికి చెందిన వెలమ రాంబాబు అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం కొయ్యూరు మండలంలోని బాలరేవుల గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటికి వచ్చారు. అనంతరం శుక్రవారం ఉదయం తిరిగి తమ గ్రామానికి కుటుంబ సభ్యులతో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో బైక్ చింతవానిపాలెం ఘాట్ కు వెళ్ళే సరికి ఒక్కసారిగా బ్రేక్ లు ఫెయిల్ అయ్యాయి. దీంతో బైక్ అదుపు తప్పి లోతైన లోయలోకి దూసుకొనిపోయి, బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాంబాబు, అతడి కుమారుడు ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు రాంబాబు భార్య కాసులమ్మ, అతడి కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం క్షతగాత్రులను రాజేంద్రపాలెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తీవ్రంగా గాయపడిన తల్లి కూతుళ్లకు ప్రధమ చికిత్స అందించిన అనంతరం 108 వాహనంలో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కొయ్యూరు ఎస్సై రామకృష్ణ తమ సిబ్బం...

సాగర్ నగర్ జూ పార్క్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Image
  విశాఖ :  సాగర్ నగర్ జూ పార్క్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్ ను డీకొన్న కారు.. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది

AP Election 2024:సజ్జల వ్యాఖ్యలపై ఘాటూగా స్పందించిన: సీఈఓ ఎంకే మీనా

Image
  AP Election 2024:సజ్జల వ్యాఖ్యలపై ఘాటూగా స్పందించిన: సీఈఓ ఎంకే మీనా అమరావతి: వైసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఎన్నికల సంఘంపై (Election Commission) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. అయితే ఈ వ్యాఖ్యలపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా (CEO Mukesh Kumar Meena)ఘాటుగా స్పందించారు. గురువారం మచిలిపట్నంలోని ఓ కౌంటింగ్ సెంటర్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో సీఈఓ ఎంకే మీనా మాట్లాడారు. ఎన్నికల కౌంటింగ్ రోజు లోపల హాల్లో ఎవరైనా అల్లర్లు చేయాలని చూస్తే వారిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపుతామని హెచ్చరికలు జారీ చేశారు.. అభ్యర్థి, ఏజెంట్‌లలో ఎవరైనా కౌంటింగ్ సెంటర్లో గొడవ చేయాలని, అడ్డుకోవాలని చూస్తే వారిని వెంటనే అక్కడి నుంచి బయటకు పంపిస్తామనివార్నింగ్ ఇచ్చారు. కౌంటింగ్ ఏరియా చుట్టూ ఎలాంటి ఊరేగింపులు చేయడానికి వీలులేదని తేల్చిచెప్పారు. ఆరోజు మధ్యం షాపులు కూడా పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ సెంటర్ల భద్రత కోసం మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్టు సీఈఓ ఎంకే మీనా తెలిపారు..

చెట్టు కొమ్మ పడి రోడ్డు పై వెళ్తున్న ఆటో పై

Image
  విశాఖ అక్కయ్యపాలెం చెట్టు కొమ్మ పడి రోడ్డు పై వెళ్తున్న ఆటో పై పడటం వల్ల ఆటో ముందుభాగం ద్వంసం అయింది.. స్థానికుల కథనం ప్రకారం ఒక అరగంట ముందు ఒక భారీ వాహనం ఆ చెట్టుని ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను కంట్రోల్ చేశారు.. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమీ కాలేదని తెలుస్తుంది.

ఎన్ఏడి ప్లే ఓవర్ వంతెనపై బోల్తా పడిన లారీ తృటిలో తప్పిన పెను ప్రమాదం..

  విశాఖ ఎన్ఏడి.                  .         .           ఎన్ఏడి ప్లే ఓవర్ వంతెనపై బోల్తా పడిన లారీ తృటిలో తప్పిన పెను ప్రమాదం..       తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఘటన ఒరిస్సా నుండి గాజువాక ఆటోనగర్ కి పేపర్ లోడ్ కి వెళ్తున్న లారీ  ప్లే ఓవర్ బ్రిడ్జిపైకి వచ్చేసరికి అదుపుతప్పి బోల్తా  స్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్...   ట్రాఫిక్ కి ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టిన పోలీసులు... మరింత సమాచారం తెలియాల్సి ఉంది

విశాఖ జిల్లా లో తాటిచెట్ల పాలెం బస్ స్టాప్ వద్ద రోడ్డు ప్రమాదం...

Image
  విశాఖ జిల్లా లో తాటిచెట్ల పాలెం బస్ స్టాప్  వద్ద రోడ్డు ప్రమాదం... హైవే  రోడ్డు దాటుతుండగా అక్కయ్య  పాలెం నుండి వస్తున్న ఒక బైక్ ఢీకొట్టింది.  ఈ ఘటన లో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.... అంబులెన్స్ కోసం వేచి చూస్తున్న  పరిస్థితి....  తాటిచెట్లపాలెంలో  ట్రాఫిక్ జామ్

ఈ రోడ్డు ప్రమాదం పై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందే!.

Image
  ఈ రోడ్డు ప్రమాదం పై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందే!. ఎందుకంటే మధురవాడ సమీపములోని సాయిరాం నగర్ లో ఉంటున్న గుమ్మడి మధు అనే వ్యక్తిపై గతంలో ఎన్నోసార్లు హత్యాయత్న ప్రయత్నాలు జరిగాయి. పి .ఎం. పాలెం పోలీస్ స్టేషన్లో ఇత ని పై కేసులు ఉండటమే గాక, ఇతను తనకు ప్రాణహాని ఉందని ఇచ్చిన ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఎలక్షన్ ముగిసిన వెంటనేఈ రోడ్డు ప్రమాదం జరిగిందంటే.... రాజకీయ హత్యలో భాగంగా,లారీ తో ఢీ కొట్టి హత్య చేసినట్లు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదము పట్ల సమగ్ర విచారణ నిష్పక్షపాతంగా చేసినట్లయితే, మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వస్తాయని ఆ ప్రాంత ప్రజలు తెలియజేస్తున్నారు.

మధురవాడ జాతీయ రహదారి దగ్గర హైస్కూల్ విశాఖ

Image
విశాఖ మధురవాడ జాతీయ రహదారి హైస్కూల్ దగ్గర లారీ ఢీకొని 35ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి పూర్తి వివరాలు తెలియదు లారీ ఢీకొని 35ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి పూర్తి వివరాలు తెలియదు