Posts

Showing posts with the label Politica

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెం నాయుడు సంచలన వ్యాఖ్యలు

Image
 శ్రీకాకుళం జిల్లా:   రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెం నాయుడు సంచలన వ్యాఖ్యలు  టిడిపి కార్యకర్తలు ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు మెడలో పసుపు బిళ్ళ వేసుకుని వెళ్ళండి అధికారులు మీకు కుర్చీ వేసి, టీ ఇచ్చి పని ఏంటి అని అడిగి ఆ పనిని చేసి పంపిస్తారు  ఎవరైనా అధికారులు మాట వినకపోతే ఏం జరుగుతుందో వాళ్లకి తెలుసు అని సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి అచ్చెం నాయుడు

సిరిపురం జంక్షన్లో స్టాపర్లు తొలగించాలని నిరసన విశాఖ సిరిపురం టైక్వాన్ జంక్షన్

Image
  *టైకూన్ *రోడ్డు*- *డివైడర్* *తొలగింపు*  *ప్రయాణికులకు కాస్త ఉపశమనం* సిరిపురం జంక్షన్లో స్టాపర్లు తొలగించాలని నిరసన విశాఖ సిరిపురం టైక్వాన్ జంక్షన్ వద్ద మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మాణాలకు అనుకూలంగా స్టాప్ బోర్డులను ఏర్పాటు చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ అక్కడికి చేరుకున్నారు. వారే స్వయంగా వీటిని తొలగించడానికి ప్రయత్నించారు. ఈలోపు అక్కడకు పోలీసులు చేరుకున్నారు. కాగా.. సిరిపురం నుంచి రేసపువానిపాలెం వైపు వెళ్లే మార్గానికి మధ్యలో స్టాపర్లను గతంలో ఏర్పాటు చేశారు.

అసాంఘిక శక్తులను హెచ్చరిస్తూ ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ.

Image
  అసాంఘిక శక్తులను హెచ్చరిస్తూ ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ. కౌంటింగ్ దృష్ట్యా అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ  బి కృష్ణారావు  ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు టి. సుండుపల్లి మండల పోలీసులు సమస్యాత్మక గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తుగా నిలువరించాలనే ముఖ్య ఉద్దేశంతో అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ బి కృష్ణారావు  గారి ఆదేశాల మేరకు టి. సుండుపల్లె మండలపోలీస్ స్టేషన్ ఎస్సై  ఎస్.కె ఎం హుస్సేన్ మండల పరిధిలో పోలీస్ స్టేషన్ నుంచి ఊరి శివారు వరకు, మరియు మడితాడు,రాయవరం  గ్రామాలలో ఎస్.కె ఎం హుస్సేన్ మరియు సిబ్బంది  ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం బిఎస్ఎఫ్ జవానులు మరియు   పోలీసులు ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహించారు.  సుండుపల్లి మండల ఎస్సై ఎస్ కే ఎం హుస్సేన్  మడితాడు మరియు రాయవరం స్థానికులతో సమావేశమై జూన్ 4 వ తేదీ వరకు ఎలక్షన్ కోడ్ తో పాటు 144 సెక్షన్ మరియు 30 పోలీసు యాక్ట్  అమలులో ఉంటుందని, చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు. ప్రజలందరూ సంయమనం ...

AP CM జగన్ విదేశీ పర్యటన ముగిసింది

Image
AP CM జగన్ విదేశీ పర్యటన ముగిసింది. ఇప్పటికే ఆయన లండన్ నుంచి బయల్దేరారు. రేపు తెల్లవారుజామున 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లిలోని నివాసానికి వెళ్తారు. రేపు మధ్యాహ్నం పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్ ఏర్పాట్లు, పోస్టల్ బ్యాలెట్ వివాదం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. జగన్ ఈనెల 17న విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.

ఏపీలో హింసాత్మక ఘటనలు.. రంగంలోకి సిట్

Image
  ఏపీలో హింసాత్మక ఘటనలు.. రంగంలోకి సిట్ AP Violence: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతర చెలరేగిన హింసపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్‌ చర్యలకు పూనుకుంది.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు అందజేసిన నివేదిక ఆధారంగా అధికారులపై వేటు వేసింది.. మరోవైపు.. ఈ హింసాత్మక ఘటనలపై రంగంలోకి దిగనుంది స్పెషల్‌ ఇన్వెస్టిగేట్‌ టీవ్‌ (సిట్‌).. ఎందుకంటే.. ఆ ఘటనలపై సిట్ వేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం సిట్ ఏర్పాటు చేస్తున్నారు.. ఎన్నికల అనంతరం జరిగిన ప్రతి హింసాత్మక ఘటన పైనా నివేదిక ఇవ్వనుంది సిట్.. పల్నాడు, మాచర్ల, నరసరావు పేట, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై దర్యాప్తు చేయనున్న సిట్.. అసలు అల్లర్లు చెలరేగింది ఎక్కడ? వాటికి బీజం వేసింది ఎవరు? హింసాత్మకంగా మారడానికి కారణాలు ఏంటి..? తదితర అంశాలపై అధ్యయనం చేయనుంది.. ఇక, తాజాగా విశాఖపట్నంలో జరిగిన ఘటననూ సిట్ పరిధిలోకి తేవాలా..? వద్దా..? అనే అంశంపై మల్లగుల్లాలు పడుడుతున్నారట అధికారులు.. మరోవైపు.. తాడిపత్రి ఘటనలో డీఎస్పీ చైతన్య తన పరిధి దాటి వ్యవహరించారని భావిస్తున్న పోలీస్ ఉన్నతాధికారులు. ఈ క...

Message from Visakhapatnam Collector

Image

పథకాలను ఈసీ అడ్డుకోవడంపై హైకోర్టును ఆశ్రయించిన లబ్ధిదారులు

Image
 బ్రేకింగ్ న్యూస్  అమల్లో డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై హైకోర్టును ఆశ్రయించిన లబ్ధిదారులు విద్యాదీవెన, ఇన్పుట్ సబ్సిడీ నిధులను అడ్డుకోవడంపై హైకోర్టుకు ఎక్కిన విద్యార్థులు, రైతులు చేయూత కింద నిధుల విడుదలను ఈసీ నిరాకరించడంపై హైకోర్టులో మహిళా సంఘం సభ్యుల పిటిషన్ లంచ్ మోషన్ కింద విచారించనున్న హైకోర్టు.

సీట్ల ప్రకటన తర్వాత పవన్ వ్యాఖ్యలు

Image
  అమరావతి *బీజేపీ కోసం సీట్లు తగ్గించుకుంటున్నాను-పవన్ కళ్యాణ్, జనసేన అధినేత:-* సిద్దం అని వైసీపీ జగన్ అంటున్నారు మేం యుద్దానికి సంసిద్ధం రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండటానికి మేం ఇది చేస్తున్నాం చాలా మంది 60 లేదా 70 సీట్లలో పోటీ చేయాలని అన్నారు గతంలో 10 సీట్లు గెలిచి ఉండుంటే అడగటానికి ఉండేది ఇప్పుడు సీట్ల సంఖ్య ముఖ్యం కాదు పరిమిత సంఖ్యలో పోటీ చేసి స్ట్రైక్ రేట్ గెలుపు లో చూపించాలని ఉంది బీజేపీకి సీట్లు ఇచ్చే క్రమంలో మేము సీట్లు తగ్గించు కుంటున్నాము రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం

చలో విజయవాడకు అనుమతి లేదు: డీసీపీ

Image
  Vijayawada: సీపీఎస్‌ ఉద్యోగుల చలో విజయవాడకు అనుమతి లేదు: డీసీపీ విజయవాడ: సీపీఎస్‌ ఉద్యోగులు ఆదివారం నిర్వహించతలపెట్టిన చలో విజయవాడకు అనుమతులు లేవని డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. నగరంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సీపీఎస్‌ ఉద్యోగుల కార్యక్రమానికి అనుమతులు ఇవ్వలేమన్నారు.. చలో విజయవాడకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు లేనందువల్ల ఎవరూ విజయవాడకు రావొద్దని సూచించారు. నగరంలో సెక్షన్‌ 30, 144 అమల్లో ఉన్నాయని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు చలో విజయవాడలో పాల్గొనవొద్దని సూచించారు. పోలీసు నిబంధనలు ఉల్లంఘించి పాల్గొంటే అరెస్టులు తప్పవని స్పష్టం చేశారు..

ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు ముగిసింది

Image
  ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు ముగిసింది గత ఏడాది డిసెంబర్ 26 నుండి అమలులోకి వచ్చిన ట్రాఫిక్ చలాన్లపై రాయితీ గడువు నిన్నటితో ముగిసింది.. మొత్తం 1.67 కోట్ల చలాన్లకు రూ.150.3 కోట్లు వసూలు అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.37.14 కోట్లు వసూలు అవ్వగా, అత్యల్పంగా ములుగు జిల్లాలో రూ.19.15 లక్షలు వసూలు అయ్యాయి.. మొత్తం పెండింగ్ చలాన్లలో 46.36% మాత్రమే క్లియర్ అయ్యాయి.

రెండో రోజు పర్యటనకు బయలుదేరిన భువనేశ్వరి

Image
Nara Bhuvaneswari: రెండో రోజు పర్యటనకు బయలుదేరిన భువనేశ్వరి అనంతపురం: నారా భువనేశ్వరి నేడు నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. కదిరి ఎర్రదొడ్డి నుండి రెండోరోజు పర్యటనకు ఆమె బయలుదేరారు.. నేడు ధర్మవరం, రాప్తాడు, పెనుకొండ నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమం నిర్వహించనున్నారు.. నేడు ఐదుగురు పార్టీ కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించునున్నారు. ధర్మవరం నియోజకవర్గం, బత్తలపల్లి మండలం, సంజీవపురం గ్రామంలో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం రాఘవేంద్ర ఫంక్షన్ హాల్‌లో చేనేత మహిళలతో భువనేశ్వరి ముఖాముఖి నిర్వహించున్నారు. రాప్తాడు నియోజకవర్గం, రామ్ గిరి మండలం, పోలెపల్లి గ్రామంలో కార్యకర్త కుటుంబాన్ని.. పెనుకొండ నియోజకవర్గం, దర్గా ప్రాంతంలో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించనున్నారు..

ఎలక్ట్రికల్ బైక్ షో రూంలో బైక్ ఛార్జింగ్ పెడుతుండగా అగ్నిప్రమాదం

Image
 *విశాఖ:* విశాఖ బుచ్చిరాజుపాలెంలో అల్లూరి సీతారామరాజు కాలనీలో ఎలక్ట్రికల్ బైక్ షో రూంలో బైక్ ఛార్జింగ్ పెడుతుండగా అగ్నిప్రమాదం .  సెల్లార్ లో ఉన్న బైక్ లతో పాటు ఎలక్ట్రికల్ మీటర్లు కూడా పూర్తిగా దగ్ధం. మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది..

వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన షర్మిల

Image
 విజయనగరం వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన షర్మిల వైసీపీ ఎంపిలు బీజేపీ కార్యాలయంలో కూర్చుంటున్నారు  బీజేపీ కి ఎందుకు అమ్ముడు పోయింది బీజేపీ ఒక మత తత్వ పార్టీ... ఆనాడు రాజ శేఖర్ రెడ్డి కూడా వ్యతిరేకించారు బీజేపీ కి జగన్ అమ్ముడు పోయాడు బీజేపీ ఎవరికి శ్రేయస్కరం కాదు రాహుల్ గాంధీ ప్రధానిగా గెలిచిన తర్వాత మొట్ట మొదటి సంతకం స్పెషల్ స్టేటస్ మీద పెడతా అన్నారు అంతలా ఏపి మీద కాంగ్రెస్ కి భాధ్యత ఉంది కాంగ్రెస్ శ్రేయస్సు కోసం నిరంతరం కార్యకర్తలు పని చేయాలి  కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది

ఏప్రిల్‍లోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు..

Image
ఏప్రిల్‍లోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు..  ఏప్రిల్‍లోనే సార్వత్రిక ఎన్నికలు..  ఫిబ్రవరి చివరలో లేదా మార్చి మొదటి వారంలో షెడ్యూల్..  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఏప్రిల్‍లో ఎన్నికలు.. ఏప్రిల్ 16న ఎన్నికలు నిర్వహించాలని రిఫరెన్స్ డేట్‍గా పెట్టుకున్న ఈసీ..  రాష్ట్రాలను సమాయత్నం చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం..  లోక్‍సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కసరత్తు..  ఏప్రిల్ 16న ఎన్నిక తేదీగా భావించి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ఢిల్లీ ఎన్నికల ప్రధానాధికారి..  ఏప్రిల్ లోనే ఎన్నికలంటూ దేశవ్యాప్తంగా ప్రచారం.. ఏప్రిల్‍లోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. లోక్‍సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు..  ఎన్నికల తేదీలపై ఆరా తీసిన రాజకీయ పార్టీలు..  ఎన్నికల సంసిద్ధత కోసం ఆ తేదీ ఇచ్చినట్లు చెప్పిన ఢిల్లీ సీఈవో..  ఢిల్లీ సీఈవో ఇచ్చిన తేదీపై ఈసీ వివరణ..