బర్మాక్యాంపులోని దాడి కేసులో నిందితుని అరెస్టు..

 



బర్మాక్యాంపులోని  దాడి కేసులో నిందితుని అరెస్టు...

ఇందులో రాజకీయ ప్రమేయం లేదు...

డీసీపీ మేక సత్తిబాబు.. 


 కంచరపాలెం పరిధిలోని బుధవారం రాత్రి మహిళలపై జరిగిన దాడి వ్యక్తిగత గొడవలే తప్ప, రాజకీయ ప్రమేయం లేదని డిసిపి మేక సత్తిబాబు వివరణ ఇచ్చారు. ఈ మేరకు గురువారం సాయంత్రం  కంచరపాలెం పోలీస్ స్టేషన్లో  ఏర్పాటు చేసింది మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ దాడి కేసును  ఓట్లు కోసం జరిగిన దాడిగా తప్పుడు ప్రచారం జరుగుతుందని విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కేసు వివరాలను వెల్లడించారు. స్థానిక బర్మా క్యాంప్, నూకాలమ్మ ఆలయం సమీపంలో  సుంకర నూకరత్నం  కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఆమె ఇంటికి సమీపంలో లోకేష్ తన కుటుంబంతో ఉంటున్నారు.  ఈ రెండు కుటుంబాల మధ్య పాత గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిన్నపాటి వివాదానికి ముందుగా నూకరత్నం, ఆమె  కుటుంబ సభ్యులు లోకేష్ ఇంటిపై  గొడవకు దిగి, వారి ఇంటిపై బీరు సీసాలు విసిరారు. ఇంటికి సమీపంలో ఉన్న లోకేష్ కు విషయం తెలిసి  అక్కడికి చేరుకొని  తన ఇంటిపై గొడవకు వచ్చిన  నూకరత్నం ఆమె కుటుంబ సభ్యులను తిట్టడం ప్రారంభించాడు. దీంతో నూకరత్నం, ఆమె కుటుంబ సభ్యులు అక్కడికి రాగా  వారిపై లోకేష్ కర్రతో దాడి చేయగా నూక రత్నం, ఆమె కుమార్తె, మరో యువకునికి గాయాలయ్యాయి. దీంతో గాయాలపాలైన వారంతా  కేజీహెచ్ వెళ్లి అత్యవసర విభాగంలో చేరారు. అక్కడ బాధితులిచ్చిన ఎమ్మెల్సీ రిపోర్టు ప్రకారం పోలీసులు దాడికి పాల్పడిన లోకేష్, మరో నలుగురిపై  కేసు నమోదు చేశారు. లోకేష్ ను రిమాండ్ కి తరలించారు. సమావేశంలో  ఏసిపి అన్నెపు నరసింహామూర్తితో పాటు సిఐ ఎస్ భాస్కరరావు, కంచరపాలెం ఎస్సై దివ్యభారతి పాల్గొన్నారు.