శివ ప్రియ నగర్ అభివృద్ధికి

 




ఈరోజు శివ ప్రియ నగర్ ఫ్లాట్ యజమానుల సంఘం మరియు శివ ప్రియ నగర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ గౌరవ శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారిని శివ ప్రియ నగర్ డెవలప్మెంట్ పై కలవడం జరిగినది ఈ యొక్క సమావేశంలో శివ ప్రియ నగరలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వారికి వివరించడం జరిగినది అదేవిధంగా శివ ప్రియ నగర్ లో వివాదంలో ఉన్నటువంటి స్థలము గురించి కూడా వారికి వివరించడం జరిగినది వారు కూడా సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే మాట్లాడి శివ ప్రియ నగర సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించాలని అధికారులకు చెప్పుట జరిగినది అదేవిధంగా శివప్రియ నగర్ లో ఉన్నటువంటి పార్కు స్థలం వివాదము మరియు ప్లాట్లకు సంబంధించిన వివాదాలను పరిష్కరిస్తామని వారు హామీ ఇవ్వడం జరిగినది. అదేవిధంగా ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా శివ ప్రియ నగర్ ప్లాట్ యజమానులు ఇల్లు నిర్మించుకోవడానికి కావలసినటువంటి మౌలిక వసతులు అయినటువంటి త్రాగునీరు విద్యుత్తు రోడ్లు ఏర్పాటు చేస్తే ఇల్లు నిర్మించుకోవడానికి మేమంతా సిద్ధమే అని తెలియజేయడం జరిగినది వారు కూడా సానుకూలంగా స్పందించి శివ ప్రియ నగర్ అభివృద్ధికి అన్ని విధాల అండగా ఉంటామని సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగినది.

ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి సభ్యులు

-------------------

తెలుగుదేశం పార్టీ నాయకులు కరీముల్లా గారు షేక్ నాగూర్ వలి అదే విధంగా సిపిఐ నాయకులు నాగబైరు. సుబ్బాయమ్మ ,తాళ్లూరి బాబురావు, నాయుడు శివ విద్యార్థి సంఘం అధ్యక్షులు మేకపోతు నాగేశ్వరరావు గారు అదేవిధంగా శివ ప్రియ నగర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అయినటువంటి  A.వీరాంజనేయులు పేలూరి. రామారావు, దివ్యల సుబ్రహ్మణ్యం మరియు శివ ప్రియ నగర్ ఫ్లాట్ యజమానులు పాల్గొన్నారు