కాంగ్రెస్ లో కి దిల్ రాజు?

 


TS: ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాలిటిక్స్ లో  కి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి దిల్ రాజును బరిలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దిల్ రాజుతో పలువురు కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే షబ్బీర్ ఆలీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా నిజామాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు.