AP: విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరసనలో భాగంగా పారిశుధ్య కార్మికులు శనివారం తెల్లవారుజాము నుంచే ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా కేఆర్ఎం కాలనీలోని జీవీఎంసీ చెత్తవాహనాల యార్డును ముట్టడించి చెత్తవాహనాలను బయటకు రాకుండా అడ్డుకున్నారు. తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని నినాదాలు చేశారు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.