బీజేపీ నాయకురాలు, నటి జయప్రద కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు తెగ వెతుకుతున్నారు. 2019లో ఎన్నికల ప్రవర్తనా నిమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉన్నారు. జనవరి 10లోగా ఆమెను తన ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను జడ్జి ఆదేశించారు. దీంతో రామూర్ ఎస్పీ ఆమెను వెతకడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ బృందం కూడా ఆమె ఆచూకీని కనిపెట్టలేకపోయింది.