జాతీయ మరియు రాష్ట్ర కమిటీ సభ్యుల నేతృత్వంలో డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కమిటీల ఏర్పాటు
డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కమిటీల ఏర్పాటు కార్యక్రమం విశాఖపట్నం నందు జాతీయ కోఆర్డినేటర్ లక్ష్మీనరసింహ, జాతీయ సభ్యులు యు. వెంకట రావు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి, సహాయ కార్యదర్శి సతీష్, కోశాధికారి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ప్రధమంగా విశాఖపట్నం నందు విశాఖ జిల్లా కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జర్నలిస్టులు మరియు పరిసర ప్రాంతాల జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు జర్నలిజం వృత్తిలో తమ స్వీయ అనుభవాన్ని తెలియజేస్తూ పరిచయంతో సమావేశాన్ని ప్రారంభించారు.
ఈ సమావేశంలో నూతన సభ్యత్వం తో పాటు జర్నలిస్టుల బాధ్యతలు హక్కులు, జర్నలిజం వృత్తిలో ఎదుర్కొంటున్న సమస్యలను, యూనియన్ బలోపేతానికి సభ్యత్వం పొందిన జర్నలిస్టుల సహకారము, మరియు జాతీయ కమిటీ తో రాష్ట్ర కమిటీ సమన్వయము, విధి విధానాలు పై జర్నలిస్టులందరూ చర్చించారు. అనంతరం విశాఖ పట్టణం, పరిసర ప్రాంతాల సభ్యత్వం పొందిన జర్నలిస్టులు అందరూ ఏకగ్రీవంగా జిల్లా కమిటీని 13 మంది జర్నలిస్టులతో తాత్కాలికంగా రూపొందించి ఎన్నుకున్నారు. వీరికి మిగతా జర్నలిస్టులు అందరూ తమ అంగీకారాన్ని తెలియజేశారు.