ప్రముఖ కార్ల తయారీ సంస్థ టెస్లా.. భారత్లో తన తొలి మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ స్థాపనకు సిద్ధమైనట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ ఫ్యాక్టరీని గుజరాత్లో ఏర్పాటు చేయనుందని తెలిపాయి. దీనిని జనవరిలో జరిగే వైబ్రంట్ గుజరాత్ సమావేశంలో వెల్లడించనున్నారని, ఇందుకోసం టెస్లాకు గుజరాత్ ప్రభుత్వం అన్ని విధాల సహాయపడనున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. కాగా దీనిపై ఇప్పటివరకు టెస్లా, గుజరాత్ ప్రభుత్వం స్పందించలేదు.