యారాడ బీచ్ లో విదేశీయుడు పై దాడి చేసి సెల్ఫోన్ రాబరీ చేసిన నిందితుల్ని 12 గంటల లోపే పట్టుకున్న న్యూ పోర్ట్ క్రైమ్ పోలీసులు.
తేదీ 24/01/2024 ఉదయము 9 గంటల ప్రాంతంలో యారాడ బీచ్ లో గుర్తు తెలియని వ్యక్తులు స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన ఒక సందర్శకుడిని కొట్టి సెల్ఫోన్ లాక్కెలిపోయిన సంఘటనలో డీసీపీ క్రైమ్స్,ఏ డి సి పి క్రైమ్స్ సూచనల మేరకు హార్బర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో న్యూ పోర్టు క్రైమ్ ఎస్.ఐ జి.వి. ప్రసాద్ మరియు సిబ్బంది 12 గంటల్లోపే ముద్దాయిలను పట్టుకుని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు పంపడమైనది.