22 నుంచి అఖిల భారత పోలీస్ కమాండో చాంపియన్ షిప్

 22 నుంచి


పోలీస్ కమాండో చాంపియన్ షిప్ పోటీలు


- 30 న ముగింపు ఉత్సవం


- గ్రే హౌండ్స్ అదనపు డీజీపీ రాజీవ్ కుమార్ మీనా

(కాపులుప్పాడ - విశాఖ భీమిలి)

అఖిల భారత పోలీస్ కమాండో చాంపియన్ షిప్ 

కాంపిటేషన్స్ - 2024 ఈ నెల 22 నుంచి 30 వరకు జరుగు తాయి అని 

 గ్రేహౌండ్స్ అదనపు డిజిపి (ఆపరేషన్స్) రాజీవ్ కుమార్ మీనా వెల్లడించారు. దేశంలో

2008 నుంచి ఆల్ ఇండియా పోలీస్ కమాండో కాంపిటేషన్స్ జరుపబడుతున్నాయి అని గుర్తు చేశారు.

 ప్రస్తుతం నిర్వహించబడుతున్న  ఏఐపిసిసి-2024 కు ఏపీ పోలీస్ తరపున గ్రేహౌoడ్స్ అతిధ్యం ఇస్తోంది.

 విశాఖ కాపులుప్పడ గ్రేహౌండ్స్ కార్యాలయ ప్రాంగణంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

ఈ పోటీలలో మొత్తం 23 జట్లు తలపడనున్నాయి. ఈ

 పోటీలలో 16 రాష్ట్ర పోలీస్, 7 కేంద్ర పోలీస్ సంస్థల జట్లు వున్నాయి.

 మొత్తం ఐదు దశల్లో పోటీల నిర్వహణ ఉంటుంది అన్నారు. సామర్ధ్యం,నైపుణ్యం,ఓర్పు ప్రదర్శించి అత్యున్నత స్థాయి  కోసం జట్లు తలపడతాయి అని పేర్కొన్నారు.

ఈ పోటీలకు ప్రారంభోత్సవంలో ముఖ్య అతిధి గా రాష్ట్ర హోoమంత్రి తానేటి వనిత పాల్గొంటారు అన్నారు. ఈ నెల 30 న

 ముగింపు వేడుకల్లో ఏపీ డీజిపి కె. రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొంటారు అని తెలిపారు. ఈ పోటీలలో దాదాపుగా 800 మంది పోలీసు ఉద్యోగులు పాల్గొంటారు అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ ఏడాది ఈ పోటీలకు ఆంధ్ర ప్రదేశ్ ఆతిథ్యం ఇస్తుంది అని తెలిపారు. మీడియా సమావేశంలో గ్రే హౌండ్స్ అధికారులు కోయ ప్రవీణ్, విద్యా సాగర్ నాయుడు, కే.నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.