విశాఖ సాగర తీరంలో సంక్రాంతి..గాలిపటాల జోరు



 సంక్రాంతి పండుగకు విశాఖ సాగర తీరంలో ఆకాశం అంతా గాలి పటాలతో కనువిందు చేస్తుంది. బీచ్ పరిసర ప్రాంతాల్లో కైట్ ఫెస్టివల్ సందడి నెలకొంది. పతంగులను ఎగురవేసేందుకు పెద్దలతో పాటు చిన్నారులు, మహిళలు యువతులు పోటీ పడుతున్నారు. విభిన్న ఆకృతుల్లో పతంగులు ఆకాశంతో ఎగరవెస్తూ సందడి చేస్తున్నారు. మార్వాడి మంచ్ సంఘం ఆధ్వర్యంలో బీచ్ రోడ్ లో చిన్నా , పెద్దా అంతా పాల్గొని పతంగుల పండుగను జరుపుకున్నారు.


తెలుగువారింట సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సాంప్రదాయ పద్దతిలో భోగి, సంకాంత్రి, కనుమగా జరుపుకుంటారు. ఇక ఏపీ ఆర్దిక రాజధాని విశాఖలో సంక్రాంతి సందడి మాములుగా ఓరేంజ్‌లో ఉంది. ఒకవైపు బీచ్‌లో కైట్‌ ఫెస్టివల్..మరోవైపు నెహ్రు యువ కేంద్రంలో బొమ్మల కొలువుతో ఎంజాయ్ చేస్తున్నారు విశాఖ వాసులు.సాగర తీరం అంతా రంగులమయమైంది. విశాఖకు వచ్చిన పర్యాటకులు సాగర తీరంలో ఈ సందడి వాతావరణాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. వివిధ ఆకృతుల్లో ఉన్న పతంగులు ఆకాశంలో ఎగురుతూ పక్షులను ఆకట్టుకున్నాయి. విశాఖ సాగర్ తీరంలో పతంగులు ఎగరవేయడం తమకు ఎంతో ఆనందానిచ్చిందని నగరవాసులు చెబుతున్నారు.