గ్రూప్-1 వాయిదా అంటూ ప్రచారం


*గ్రూప్-1 వాయిదా అంటూ ప్రచారం.. కీలక ప్రకటన చేసిన అధికారులు..*


AP: గ్రూప్-1 పరీక్ష వాయిదా అంటూ జరుగుతున్న ప్రచారంపై ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ స్పందించారు. 'మార్చి 17న గ్రూప్-1 పరీక్ష యథావిధిగా ఉంటుంది. అభ్యర్థులు వదంతులు నమ్మకండి. పరీక్షలకు సిద్ధం కావాలి. ఇవాల్టి గ్రూప్-2 పరీక్షలకు 4.63 లక్షల మంది హాజరయ్యారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదు. జూన్ లేదా జులైలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెల్లడిస్తాం' అని ఆయన తెలిపారు.