ఈనెల 18న సీపీఎస్ ఉద్యోగుల ఛలో విజయవాడ
ఈ నెల 18న సిపిఎస్ ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్నట్లు సిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలిపింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని సంఘం అధ్యక్ష కార్యదర్శులు కోరుకొండ సతీష్, సీఎం దాస్ విమర్శించారు..
సిపిఎస్ ను రద్దు చేస్తారన్న హామీని సీఎం జగన్ నెరవేర్చలేదని మండిపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల ఉద్యోగులు ఈ నిరసనలో పాల్గొంటారని తెలిపారు. ఇక అటు నేడు సర్పంచుల ఛలో అసెంబ్లీ కార్యక్రమం ఉంది.నేడు సర్పంచుల ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ తరుణంలోనే… నిన్నటి నుంచే సర్పంచులను హౌస్ అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. ఏపీ సర్పంచుల సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ను నిన్నే హౌస్ అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న సర్పంచులను అక్కడే హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. హై అలర్ట్ ప్రకటించారు..