పీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ హడావుడిగా భర్తీ చేస్తోన్న 897 గ్రూప్-2 ఉద్యోగాలకు స్క్రీనింగ్ పరీక్ష ఫిబ్రవరి 25న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు (జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ) నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లా కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు ఫిబ్రవరి 14 నుంచి హాల్ టికెట్లు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి ముందుగా చేరుకొవాలని విజ్ఞప్తి చేసింది.
రాష్ట్రంలో 897 పోస్టుల భర్తీకి డిసెంబర్ 21 నుంచి జనవరి 17 వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.