*గృహిణి ( హోమ్ మేకర్ ), స్వతంత్రంగా ఆదాయ వనరులు లేని భార్య పేరు మీద భర్త కొనుగోలు చేసిన ఆస్తిని కుటుంబ ఆస్తిగానే పరిగణించాలని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది.*
గృహిణి ( హోమ్ మేకర్ ), స్వతంత్రంగా ఆదాయ వనరులు లేని భార్య పేరు మీద భర్త కొనుగోలు చేసిన ఆస్తిని కుటుంబ ఆస్తిగానే పరిగణించాలని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. మరణించిన తన తండ్రి ఆస్తికి తనకే చెందుతుందని తీర్పు ఇవ్వాలంటూ ఓ వ్యక్తి వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. సాధారణంగా కుటుంబానికి పెద్ద అయిన భర్త పేరు మీదే ఆస్తిని కొనుగోలు చేస్తారని.. భార్య పేరు మీద కొనుగోలు చేసినంత మాత్రానా అది ఆమె సొంత ఆస్తి కాదని తెలిపింది. భార్య తన సంపాదనను ఉపయోగించి ఆస్తిని కొనుగోలు చేసినట్లు రుజువు చేసుకోవాలని, లేకపోతే అది కుటుంబ ఆస్తిగానే భావించారని వివరించింది.
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ చెందిన సౌరభ్ గుప్తా అలహాబాద్ న్యాయస్థానంలో సివిల్ దావాను దాఖలు చేశారు . తన తండ్రి కొనుగోలు చేసిన ఆస్తిలో నాల్గో వంతుకు తాను సహ-భాగస్వామ్యుడిని పిటిషన్ లో పేర్కొన్నాడు. ఆ ఆస్తిని చనిపోయిన తన తండ్రి కొనుగోలు చేసినందున అతను తన తల్లితో పాటు సహ-భాగస్వామినని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. తనకు స్వతంత్ర ఆదాయ వనరులు లేనందున ఆ ఆస్తిని తన భర్త తనకు కానుకగా ఇచ్చాడని తల్లి తెలిపింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు ఇలాంటి ఆస్తి ఉమ్మడి కుటుంబం మొత్తానికి అవుతుందని స్పష్టం చేసింది.