ఏపీలో నేడు కేంద్ర మంత్రి రాజ్‌నాధ్ సింగ్ పర్యటన


Rajnath Singh: ఏపీలో నేడు కేంద్ర మంత్రి రాజ్‌నాధ్ సింగ్ పర్యటన


అమరావతి: కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ (Rajnath Singh) మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం (Visakha)లో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు..


మధ్యాహ్నం ఢిల్లీ (Delhi) నుంచి ఆయన గన్నవరం విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి విజయవాడలోని ఒక ప్రైవేటు హోటల్‌లో జరగనున్న బీజేపీ కోర్ కమిటీ (BJP core committee) సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తారు. అనంతరం రాజ్‌నాథ్ సింగ్ ఏలూరు బయలుదేరి వెళతారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో బీజేపీ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. అక్కడ కార్యక్రమాలు ముగించుకుని గన్నవరం విమానాశ్రయం చేరుకుని ఢిల్లీకి బయలుదేరి వెళతారు..

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం