గోకవరం పిబ్రవరి 15:-కోరుకొండ మండలం శ్రీ రంగపట్నం గ్రామంలో ఎంతో వైభవంగా శ్రీ దేవి గౌరి శంకరుల రధం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షులు కంబాల శ్రీనివాస రావు అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నేడు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగిందని ఇక్కడ జరిగిన కార్యక్రమానికి సుమారుగా 1000 మంది మహిళమూర్తులు హాజరైవడం ఎంతో సంతోషంగా ఉందని, గ్రామ ప్రజలందరూ కలిసి శ్రీ దేవి గౌరి శంకరుల రధోత్సవం కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించుకోవడం చాలా అనందంగా ఉందని, అంతేకాకుండా గ్రామంలో ఉన్న మహిళమూర్తులు వండిన పిండి వంటలను సారి ని ఊరంతా తిరిగి శ్రీ దేవి గౌరి శంకరులకు నైవేద్యం గా సమర్పించారనన్నారు.అనంతరం గ్రామస్తులతో పాటు దాతలు ఆర్ధిక సహాయం తో రధాన్నీ రూపొందించడం జరిగిందని,ఈ రథోత్సవం కార్యక్రమంలో లక్ష రూపాయలు ఆలయ కమిటీ సభ్యులకు అందజేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు మామిడి అయ్యప్ప, తామర్ల రాంబాబు,ఇనకోటి బాపన్న దొర,వరసాల ప్రసాద్, వల్లూరి జగన్నాధ రావు శర్మ, ఆలయ కమిటీ సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.