ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ

 

అమరావతి: జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శుక్రవారం మంత్రుల కమిటీ చర్చలు చేపట్టింది. 16 ఉద్యోగ సంఘాలతో మంత్రి బొత్స, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ జవహర్‌రెడ్డి సమావేశమయ్యారు..


పీఆర్సీ బకాయిలు, పెండింగ్‌ డీఏలపై ఈ భేటీలో చర్చించారు. డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 27న చలో విజయవాడకు ఏపీ ఐకాస పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ అత్యవసరంగా భేటీ అయింది. ఉద్యోగులకు మధ్యంతర భృతి చెల్లించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది..


ఉద్యోగులపై బొత్స చిరాకు..


బకాయిలు చెల్లించాలని వినతి పత్రం ఇచ్చిన రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై మంత్రి బొత్స చిరాకు పడ్డారు. ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యేందుకు సచివాలయానికి వచ్చిన మంత్రిని ఉద్యోగులు చుట్టుముట్టారు. సమస్యలను మంత్రికి ఏకరవు పెట్టారు. ఎన్నికల కోడ్‌ రాకముందే బకాయిలు చెల్లించాలని కోరిన ఉద్యోగులపై బొత్స అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్‌కు, బకాయిలు విడుదలకు సంబంధం ఎంటని ప్రశ్నించారు. మరోసారి వచ్చి కలవాలని కోరారు..

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,