గుర్తుతెలియని దుండగులు దాడి











గుర్తుతెలియని దుండగులు దాడి తో గాయాలు పాలైన కోరాడ విజయబాబు అనే బాధితుడు


ప్రశాంత విశాఖ నగరంలో దాడులు భయానక సంఘటనలు రోజురోజుకు మితిమీరుతున్నాయి దుండగులు పెట్రేగిపోతున్నారు తాజాగా కోరాడ విజయబాబు అనే కాంట్రాక్టర్ పై ఆదివారం రాత్రి 9:45 ప్రాంతంలో దాడి .

వివరాల్లోకి వెళితే కోరాడ విజయ్ బాబు అనే కాంట్రాక్టర్ తన కన్స్ట్రక్షన్ సైట్ వద్ద విధులు ముగించుకొని ఇంటికి చేరుకునే సమయంలో విశాఖ టెంపని స్కూల్ ఏ గేటి వెనుక భాగంలో చేరేటప్పటికీ ఫోన్ రావడంతో కారు ఆపి ఫోన్ మాట్లాడుతుండగా నలుగురు గుర్తు తెలియని అగంతకులు ఒక్కసారిగా మారణ ఆయుదాలతో దాడి చేయడంతో భయభ్రాంతులకు గురై అరుపులు కేకలు వేయగా దుండగులు షిఫ్ట్ కారులో పారిపోయారని దెబ్బలకు తను సొమ్మసిల్లి పోయానని అయితే తేరుకొన్న వెంటనే మూడవ పట్నం పోలీస్ వారికి ఫిర్యాదు చేశానని సోమవారం స్పందనలో సిపి కి కూడా ఫిర్యాదు చేశానని పోలీసువారి ఆధ్వర్యంలో ఎం ఎల్ సి చేయడం కూడా జరిగిందని తెలియజేస్తూ దీనిపై సమగ్ర విచారణ జరిపి కారణాలు తెలుసుకొని దుండగులను కఠినంగా శిక్షించి తనకు రక్షణ కల్పించాలని కోరారు

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం