TTD: కాంట్రాక్టు, సొసైటీ ఉద్యోగుల వేతనాలు పెంచిన తితిదే

TTD: కాంట్రాక్టు, సొసైటీ ఉద్యోగుల వేతనాలు పెంచిన తితిదే


తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)లోని వివిధ విభాగాల్లో పనిచేస్తోన్న 9వేల మంది సొసైటీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది..


సోమవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి వివరించారు.


గాలి గోపురం, ఆంజనేయస్వామి, మోకాలి మెట్టు వద్ద నిత్యాసంకీర్తనార్చన గానం నిర్వహించాలని నిర్ణయం


తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరం ఏర్పాటు


శ్రీవారి ఆలయంలోని జయవిజయులు ద్వారానికి బంగారు తాపడం కోసం రూ.1.69 కోట్లు మంజూరు


రూ.4 కోట్లతో మంగళసూత్రాలు తయారీకి 4 ప్రముఖ బంగారు వ్యాపార సంస్థలకు టెండర్


కార్పొరేషన్‌లోని అటవీశాఖ కార్మికులను తిరిగి సొసైటీలో చేర్చి జీతాలు పెంపు


పాదిరేడులోని ఉద్యోగుల ఇంటిస్థలాల లేఅవుట్ అభివృద్ధికి రూ.8.16 కోట్లు తుడాకు చెల్లించాలని నిర్ణయం


రూ.3.89 కోట్లతో తిరుచానూరు ఆలయంలో విద్యుత్తు అలంకరణ


రూ.4.12 కోట్లతో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిర్వహణకు అలిపిరి వద్ద శాశ్వత భవనం నిర్మాణం


రూ.3.15 కోట్లతో తిరుమలలో పలుచోట్ల కొత్త మోటార్‌ పంపుసెట్లు ఏర్పాటు


తిరుమలలో ఎఫ్.ఎం.ఎస్ సేవలకు మరో మూడేళ్లు పొడిగింపు


గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవవిగ్రహాలకు బంగారుపూత చేయాలని నిర్ణయం


అలిపిరి, గాలిగోపురం, లక్ష్మీనరసింహస్వామి వద్ద ఉన్న నీటి బావులు ఆధునికీకరణ


బాలబాలికలు కోసం సులభశైలిలో వివిధ భాషలలో భగవద్గీత పుస్తకాలు రూపొందించేందుకు రూ.3.72 కోట్లు మంజూరు


శ్రీలంకలో శ్రీవారి కళ్యాణం నిర్వహించాలన్న నిర్ణయానికి మండలి ఆమోదం