*బ్రేకింగ్*:
*వాలంటీర్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం*
వాలంటీర్లను తక్షణమే ఎన్నికల విధుల నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.
ఎన్నికలతో ముడిపడిన ఏ ప్రక్రియలోనూ వారిని పాల్గొననివ్వవద్దని పేర్కొంది.
పోలింగ్ ఏజెంట్లుగా కూడా ఉండేందుకు వారు అనర్హులని తెలిపింది.
కాగా ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది.
దీంతో ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేసింది.