బ్యాంకుల్లో అనుమానాస్పద లావాదేవీలపై నిఘా

 సార్వత్రిక ఎన్నికల వేళ.. బ్యాంకుల్లో అనుమానాస్పద లావాదేవీలపై నిఘా


పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. 


రెండు నెలల్లో రూ.లక్షకు మించి జమ, విత్‌ డ్రా చేసిన ఖాతాలు, ఒకే జిల్లాలో అనేక మందికి ఆన్‌లైన్‌ బదిలీ అయిన ఖాతాల వివరాలు సేకరించాలని సూచించింది. రూ.లక్షకు మించి జమ, డిపాజిట్‌ చేసిన అభ్యర్థి లేదా కుటుంబసభ్యుల, పార్టీల ఖాతాల వివరాలు సేకరించాలని తెలిపింది.


రూ.10లక్షల జమ, డిపాజిట్ల వివరాలు ఐటీకి ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. బ్యాంకుల నుంచి జిల్లా ఎన్నికల అధికారులు సమాచారం తెప్పించు కోవాలని, అనుమానం ఉంటే వాటి వివరాలు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లకు ఇవ్వాలని తెలిపింది.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,