Kadapa: ఇదేం అరాచకం.. దస్తగిరి తండ్రివి నీవేనా అంటూ దాడి!
కడప : మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసులో (YS Viveka Case) అప్రూవర్‌గా మారిన దస్తగిరి (Dastagiri) తండ్రి హాజీపీరాపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడం కలకలం రేపుతోంది..
గత రాత్రి పులివెందులలో దస్తగిరి తండ్రిని కొందరు వ్యక్తులు బెదిరిస్తూ.. దాడికి పాల్పడారు. శివరాత్రి జాగరణకు వెళ్లిన హాజీపీరాను అడ్డగించి దాడి చేశారు. ''దస్తగిరి తండ్రివి నీవేనా అని అడిగి.. జగన్ రెడ్డిని విమర్శించి ఆయనతో పోటీపడే స్ధాయి నీ కొడుక్కువుందా?... దస్తగిరిని ఎలాగైనా చంపేస్తాము'' అని సదరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే జగన్ పేరుతో బెదిరించి దాడి చేశారు కాబట్టి వైసీపీకి చెందిన వారే అని దస్తగిరి తండ్రి హాజిపీరా ఆరోపించారు. పులివెందుల మండలం నామా లగుండు వద్ద దాడి చేశారని బాధితుడు హాజీపీరా చెప్పుకొచ్చారు..