రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం*
విశాఖపట్టణం, ఏప్రిల్ 12 ః జిల్లాలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లిఖార్జున శుక్రవారం స్థానిక రూరల్ తహశీల్దార్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఎన్నికల కోడ్ అమలు, కొత్త ఓటర్ల నమోదు, ప్రచార ప్రక్రియ తదితర అంశాలపై చర్చించారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కలెక్టర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అందరూ కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల ప్రశ్నలకు కలెక్టర్ సమాధానం ఇచ్చారు. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. కోడ్ అమల్లో అందరూ సహకరించాలని, ఏమైనా సమస్యలు ఉంటే తనకు తెలియజేయవచ్చని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు.
సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
................................................
జారీ, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, విశాఖపట్టణం.