సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తుగా ఓడించిన గుజరాత్

 సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తుగా ఓడించిన గుజరాత్ 



గుజరాత్ :-

ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ తమ సొంత మైదానంలో సన్ రైజర్స్  హైదరాబాద్ తో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించింది.


ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరా బాద్ ను గుజరాత్ స్వల్ప పరుగులకే పరిమితం చేసి, ఆపై ఛేదనలో రాణించింది.


దీంతో హైదరాబాద్‌పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధిం చింది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌ హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులకే పరిమితమైంది.


ఇక చేజింగ్‌లో గుజరాత్ బ్యాట‌ర్లు బౌండ‌రీలతో విరుచుకుప‌డ్డారు.. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (25), కెప్టెన్ శుభమాన్ గిల్ (36), బి సాయి సుదర్శన్ (45), డేవిడ్ మిల్లర్ 44 నాటౌట్ విజయ్ శంకర్ 14 నాటౌట్  దంచికొట్టారు....