*అనకాపల్లి జిల్లా పోలీసు*
*రంజాన్ పండుగ సందర్భంగా
అనకాపల్లి జిల్లాలోని ముస్లిం సోదరులకు, పోలీస్ సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు "ఈద్ ముబారక్" తెలియజేసిన జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ, ఐపీఎస్*
*అనకాపల్లి, ఏప్రిల్ 11:*
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ 30 రోజులపాటు కఠినమైన ఉపవాస దీక్షలు చేసి వాటిని విరమించిన ముస్లిం సోదరులు, సోదరీమణులు ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ‘ఈద్ ఉల్ ఫితర్’ జరుపుకునేందుకు జిల్లాలోని అన్ని మసీదులు, ఈద్గాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
ఈ రంజాన్ సందర్భంగా అందరి మంచినీ కోరుకుంటూ, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, జిల్లాలోని ముస్లిం సోదరులు, సోదరీమణులు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి, పాత్రికేయ మిత్రులు మరియు వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ గారు "ఈద్ ముబారక్" తెలియజేసినారు.
*జిల్లా పోలీసు కార్యాలయం,* *అనకాపల్లి.*