విశాఖపట్నం లోనికి అక్రమ మద్యం, నగదు రవాణా ను అరికట్టడం లో భాగం గా


విశాఖపట్నం లోనికి అక్రమ మద్యం, నగదు రవాణా ను అరికట్టడం లో భాగం గా

సెబ్ పోలీసులు నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా ను ఆపేందుకు డాగ్ స్క్వాడ్ లతో ఆర్టీసీ కాంప్లెక్స్ లో పోలీసులు తో కలిసి  సెబ్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్  సుబ్బారావు తనిఖీలు నిర్వహించారు. జాయింట్ డైరెక్టర్ ఆదేశాల ప్రకారం ముమ్మర దాడులు నిర్వహిస్తున్నామన్నారు.  గత నెలలో మహారాణిపేట సేబ్ స్టేషను పరిధి లో 37 బెల్ట్ కేసులు  నమోదు చేశామని చెప్పారు. ఎవరైనా సమాచారం ఇస్తే తక్షణం స్పందిస్తామని సుబ్బారావు తెలిపారు. తనిఖీల్లో మహారాణిపేట సీఐ మధు కుమార్, రాజుల నాయుడు, SI లు మోహన్, వేణు పాల్గొన్నారు