ఋషికొండ బీచ్ లో యువకులను కాపాడిన లైఫ్ గార్డులు

 *ఋషికొండ బీచ్ లో యువకులను కాపాడిన లైఫ్ గార్డులు



విశాఖపట్నం మార్చ్ 31, రుషికొండ సముద్ర తీరంలో  మునిగిపోతున్న హైదరాబాదు కు చెందిన ఇద్దరు యువకులను ఆదివారం జీవీఎంసీ లైఫ్ గార్డులు రక్షించి వారి ప్రాణాలను కాపాడారని జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ ఆదివారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. 

రుషికొండ సముద్ర తీరంలో హైదరాబాదు ప్రాంతానికి చెందిన రాజు వయస్సు 26, సునీల్ కుమార్ వయస్సు 25 సముద్రంలో స్నానాలకు వెళ్లి  అలలకు చిక్కుకొని లోపలికి వెళ్ళిపోతు కేకలు పెడుతున్న వారిని జీవీఎంసీ లైఫ్ గార్డులు  సతీష్ ,రాజు సకాలంలో స్పందించి వారిని రక్షించి, ఒడ్డుకు చేర్చి వారి ప్రాణాలను కాపాడారని కమిషనర్ తెలిపారు.

విశాఖ నగరానికి విచ్చేస్తున్న సందర్శకులు, పర్యాటకులు, నగర ప్రజలు నగరంలో గల సముద్ర తీర ప్రాంతాల్లో  సరదాగా స్నానాలు చేసేందుకు వెళ్ళి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారన్నారు. జీవీఎంసీ ఏర్పాటుచేసిన లైఫ్ కార్డులు నిత్యం నిఘాతో పరిశీలిస్తూ వారి ప్రాణాలను కాపాడుతున్నారని ఆయన తెలిపారు.  బీచ్ అందాలను ఆహ్లాదకరంగా ఆస్వాదించాలని , సముద్ర లోతుల్లోకి వెళ్లి ప్రాణాలను పోగొట్టుకోరాదని కమిషనర్ సందర్శకులకు పత్రికా ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,