పిటిషనర్పై CJI ఆగ్రహం

 *హైస్కూల్ పూర్తవగానే లా ప్రాక్టీస్ మొదలుపెట్టండి: పిటిషనర్పై CJI ఆగ్రహం


ఇంటర్ తర్వాత ఐదేళ్లకు బదులుగా మూడేళ్ల లా కోర్సు (LLB) చదివేందుకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై CJI జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 'మూడేళ్లు కూడా ఎందుకు? హైస్కూల్ పూర్తవగానే లా ప్రాక్టీస్ మొదలుపెట్టండి' అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రస్తుత విధానం సరిగానే ఉందని పేర్కొంది. కాగా ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసినవారు మాత్రమే నేరుగా మూడేళ్ల లా కోర్సులో చేరేందుకు అవకాశం ఉంది.