విశాఖ తూర్పు లో భారీగా కోడ్ ఉల్లంఘన
• నాటకీయ పరిణామాల మధ్య ఎంవివి కార్యాలయంలో 6 గంటల పాటు సోదాలు
• సోదాలలో పాల్గొన్న 4 ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు
• వందల కొద్ది చీరలు వేలకొద్దీ కూపన్లు, డిజిటల్ వాచ్ లు, గాజులు, నగదు గుర్తింపు
విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం లో వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేసేందుకు ఓటర్లకు తాయిలాలు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో నిఘా పెట్టిన ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్యడ్ బృందాలు ఒకేసారి ఎంవివి సత్యనారాయణ కార్యాలయం, ఇళ్లపై దాడులు నిర్వహించి ఆరు గంటలకు పైగా సోదాలు నిర్వహించారు. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ఈ నెల 13న జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఏంఎల్ఏ అభ్యర్ధిగా ఎంవివి సత్యనారాయణ పోటీ చేస్తున్నారు ఇదే క్రమంలో తన నియోజకవర్గం పరిధిలోని నాలుగు వార్డులలో కూపన్లను,డిజిటల్ వాచ్ లు, గాజులు, నగదు పంచేందుకు సిద్ధం చేశారు. అనుకున్న కార్యచరణ ప్రకారం శుక్రవారం రాత్రి 9 గంటల తర్వాత వీటిని పంచేందుకు తమ కార్యకర్తలను కార్యాలయానికి పిలిచి వారికి ఆయా ప్రాంతాల యొక్క ఓటర్ లిస్ట్ లను పంచి ఈ కుపన్డిజిటల్ వాచ్ లు, గాజులు, నగదు లను ఎలా జారీ చేయాలి, ఏ వస్తువు ఎవరికి జారీ చేయాలి అన్న అంశాలపై శిక్షణ ఇస్తుండగా ఒక్కసారిగా రెండు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఆఫీసులో దాడులు ప్రారంభించాయి. ఇదిలా ఉండగా మరొక బృందం ఎంవివి 18 వ వార్డులో నిర్వహిస్తున్న సిద్ధం సభ వద్దకు వెళ్లి ఎంవివి సత్యనారాయణ ను రాత్రి 9:30 సమయంలో ఆఫీసుకు తీసుకువచ్చారు. ఆ తదనంతరం మరొక ఫ్లయింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్ 9:45 గంటలకు ఆఫీసుకు చేరుకుని రాత్రి రెండు గంటల వరకు సోదాలు నిర్వహించాయి ఈ సోదాలలో భారీగా చీరల తో పాటు , పంచడానికి సిద్ధంగా ఉంచిన కుపన్ లు డిజిటల్ వాచ్ లు, గాజులు, నగదు గుర్తించడం జరిగిందని సమాచారం. ఇదిలా ఉండగా 13వ తారీకు ఎన్నికలకు ముందుగానే ప్రతి ఇంటికి ఆ ప్రాంత పరిస్థితులు బట్టి అపార్ట్మెంట్ ఓటర్లకు ఒకరంగు, స్లమ్ ఏరియా ఓటర్లకు ఒకరంగు, మధ్యతరగతి వాళ్ళకి ఒక రంగు చొప్పున మూడు రంగులలో ఈ కుపన్లను సిద్ధం చేయడం జరిగిందని వీటిలో 3000, 4000, 5000 చొప్పున మూడు విభాగాలుగా పంచేందుకు ఈ కుపన్లు సిద్ధం చేశారని తెలుస్తుంది మొదటగా ఓటర్ లిస్ట్ ప్రకారం ప్రతి ఇంటికి ఈ కుపన్లు పంపిణీ చేసి అనంతరం ఆ కూపన్లను , హవాలా రూపంలో మరొక ప్రాంతానికి లేదా వాళ్ళు సూచించిన ప్రాంతానికి వెళ్లి నగదు, సదరు వస్తువులను తీసుకునేలా పథకం రచించారు. ఇదిలా ఉండగా సిద్ధం సభలకు కూడా ఇదే విధంగా టోకెన్లు ఇచ్చి డబ్బులు పంచుతున్నారని సమాచారంతో గత మూడు రోజులుగా ఎంవివి సత్యనారాయణ , సిద్ధం సభలపై నిఘా పెట్టిన ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు శుక్రవారం రాత్రి దాడులు ప్రారంభించాయి ఈ దాడులు నిర్వహించే సమయంలో ఆఫీస్ సిబ్బందితోపాటు ఎంవివి సత్యనారాయణ ఆయన సన్నిహితులు జీ.వెంకటేశ్వరరావు(జీవి) కూడా ఆఫీసులోనే ఉన్నారు ఆయనతో పాటు ఆఫీస్ సిబ్బందిలో కొంతమందిని 12 గంటల వరకు, మరి కొంతమందిని ఒంటి గంటన్నర వరకు విచారించారు. ఈ దాడిలో విశాఖపట్నం ఈస్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్, విశాఖపట్నం ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఎఫ్ ఎస్ టి టీం - 4 లతోపాటు మరో రెండు బృందాలకు చెందిన సుమారు 25 నుండి 30 మంది అధికారులు పాల్గొన్నారు. సోదాల అనంతరం అధికారులు బయటకు వెళ్ళిపోగా , ఆ చీరలను, కుపన్లను ఇతర సామాగ్రి ,నగదు,ను సీజ్ చేసి ఎంవిపి పోలీస్ స్టేషన్ కు తరలించారు.