ఎన్నికల ప్రచారం... షెడ్యూల్

 *చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతో కలిసి ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం... షెడ్యూల్


*


ఈ నెల 6, 8 తేదీల్లో ఏపీలో మోదీ పర్యటన


బీజేపీ ఎంపీలు పోటీ చేస్తున్న లోక్ సభ స్థానాల పరిధిలో ప్రధాని సభలు


మోదీతో పాటు హాజరుకానున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్


ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. ఇవాళ కూటమి నేతలు లంకా దినకర్ (బీజేపీ), అశోక్ బాబు (టీడీపీ),  గౌతమ్ (జనసేన) విజయవాడ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ వివరించారు.


మే 6వ తేదీ ప్రధాని నరేంద్ర మోదీ మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి విమానాశ్రయం చేరిక

మధ్యాహ్నం 3.30 గంటలకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని వేమగిరి వద్ద 16వ నెంబరు జాతీయ రహదారికి సమీపంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరు

ఈ సభకు రాజమండ్రి బీజేపీ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ హాజరు

అనంతరం సాయంత్రం 5.45 గంటలకు ప్రధాని మోదీ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరిక

సాయంత్రం 5.55 గంటలకు అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో బహిరంగ  సభకు హాజరు. ఈ సభకు అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేశ్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ హాజరు


మే 8వ తేదీ, ప్రధాని నరేంద్ర మోదీ మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరిక అన్నమయ్య జిల్లా పీలేరు మండలం కలికిరి వద్ద మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభకు హాజరు. రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఈ సభకు హాజరు

సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరిక

సాయంత్రం 5 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ లతో కలిసి మోదీ రోడ్ షో