బిల్టు ఫ్యాక్టరీ కార్మికులకు రావాల్సిన 69 కోట్లు వేతనాలు ఇవ్వకుండా...వేదిస్తున్న బిల్టు ఫ్యాక్టరీ యాజమాన్యం పై అలుపెరగని పోరాటం చేస్తున్న డా. ఆకుల గణేష్....

 








బిల్టు ఫ్యాక్టరీలో 40 సంవత్సరాల నుండి పనిచేసి కర్మాగారం ఒడిదుడుకులలో పాలుపంచుకున్న కార్మికుల కు రావాల్సిన వేతనాలు ఇవ్వకుండా బిల్ట్ యాజమాన్యం కార్మిక నాయకులతో కుమ్మక్కై కర్మాగారాన్ని 2014 ఏప్రిల్ 6న బందు చేసి కార్మికులకు కార్మికుల కుటుంబాలకు తీరని అన్యాయం చేసారు అని ప్రముఖ సమాజ సేవకులు న్యాయవాది డా ఆకుల గణేష్ మాట్లాడుతు ప్రభుత్వం తక్షణమే తగు చర్యలు తీసుకోవాలి అని అన్నారు. కర్మాగారంలో ఉత్పత్తికి డిమాండ్ లేదనే సాకు తో యాజమాన్యం కార్మికులను అర్ధాంతరంగా బయటకు పంపించింది.  అప్పుడున్న సమయంలో ధర్నాలు రాస్తారోకోలు నిరాహార దీక్షలు చేసినప్పటికీ యాజమాన్యం కార్మికులను పట్టించుకోకుండా కేవలం కార్మిక నాయకులతో కుమ్మక్కై వారికి లబ్ధి చేకూర్చింది అని విమర్శించారు. రోజు గేటు లోకి వచ్చి సంతకాలు చేస్తేనే కార్మికులకు వేతనాలు ఇస్తారని లేకుంటే ఇవ్వరు అని చెప్పి కార్మిక జేఏసీ నాయకులు భయపెడితే బయట పనులకు కూడా వెళ్లకుండా ఫ్యాక్టరీ కి వెళ్లినసరే  జీతాలు ఇవ్వలేదు ఇల్లు గడవక .ఆపద కాలంలో పనికి వస్తాయని ఇదివరకు ఎల్ఐసి చేసుకున్నాము. కానీ మధ్యలోనే ఎల్ఐసీలు ఆపివేసి కుటుంబాలను ఆదుకున్నాము అయినా అవి సరిపోక కొంతమంది కార్మికులు పేదరికం తట్టుకోలేక ఆర్థిక భారం ఎక్కువై  కొంతమంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు 58 మంది కార్మికులు చనిపోయారు. ది. 17.1.2020 న ఎన్సీఎల్టీ ట్రిబ్యునల్ కు వెళ్ళి కార్మిక నాయకులు  ఎన్ సి ఎల్ టి కోర్టులో కార్మికుల పక్షాన కేసు వేసి  ఒక్కొక్క కార్మికుని దగ్గర  2000 రూపాయలు వసూలు చేసి లాయర్ ను పెట్టారు కేసు నడిచే క్రమంలో లాయర్ ను ప్రక్కకు తప్పించి ఆర్ పి మరియు  పిన్ క్విస్ట్ సమస్త జేఏసీ నాయకులు కలిసి . కార్మికులకు ఎన్సీఎల్టీ కోర్టు 69 కోట్లు డిక్లేర్ చేస్తే కార్మిక నాయకులు ఆర్పి కలిసి 9 కోట్లు 24 నెలల జీతం అని  డిక్లేర్ చేసి  కార్మికుల బ్యాంక్ ఎకౌంట్లో జమ చేసారు.  చట్ట ప్రకారం కార్మికులకు గ్రాడ్యుటి రావాలని గొడవ చేస్తే కార్మిక నాయకులు జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వరంగల్ వారు పిన్ క్విస్టు సంస్థ వారు కలిసి డేట్ ఆఫ్ జాయినింగ్ నుండి 2015 డిసెంబర్ వరకు గ్రాడ్యుటి ఇచ్చారు ఆ గ్రా డ్యూటీ లో 24 నెలల ముందుగా ఇచ్చిన జీతాలను కట్ చేసుకుని గ్రాడ్యుటిగా చూపించారు అని వారికి  డేట్ ఆఫ్ జాయినింగ్ నుండి NCLT కటాఫ్ చేసిన ది.17 .1. 20 20 వరకు గ్రాడ్యూటీ కట్టించాలి. అయితే వారి జీతాలు సెప్టెంబర్ 2015 నుండి 17.1.2020 వరకు జీతాలు ఇవ్వాలి. NCLT ట్రిబ్యునల్ డిక్లేర్ చేసిన 69 కోట్ల నుండి వాళ్ళ బకాయిలు ఇప్పించి  కార్మికుల కుటుంబాలను  ఆదుకోవాలని  ఈ విషయంపై తగు విచారణ జరపాలని తక్షణమే కార్మికుల న్యాయం జరిగేలా చూడాలని (ప్రభుత్వాన్ని) సంబంధిత అధికారులను డా. ఆకుల గణేష్ డిమాడ్ చేశారు..