విశాఖ
పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు సీఐ సమక్షంలో
విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం లో మల్కాపురం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ సనఉల్లాహ్ స్వీయ పర్యవేక్షణలో గురువారం తోటి సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఉష్ణతాపంతో ఇబ్బందులు ప్రతి ఒక్కరికి సర్వసాధారణమని సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ఈ కార్యక్రమం నిర్వహించమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్, క్రైమ్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.