బిగ్ బ్రేకింగ్ న్యూస్
అన్నమయ్య జిల్లా మదనపల్లె
*జిల్లాలో సంచలనం రేకెత్తించిన శేషాద్రి హత్య కేసులో ఏడుగురు అరెస్ట్*
ఈ నెల 25న మదనపల్లె అనపగుట్ట శ్రీవారి నగర్ లో జిల్లాలో సంచలనం రేకెత్తించిన రామారావు కానీకి చెందిన పుంగనూరు శేషాద్రి అలియాస్ శేషు(32) దారుణ హత్య కేసులో నిందితులను ఎట్టికేలకు పోలీసులు శుక్రవారం ఏడుగురిని అరెస్టు చేశారు.
కుల సంఘాల నేతల మధ్య భూ కబ్జాలు, భూ దందాలు, సెటిల్మెంట్లు విచ్చలవిడిగ దాడులకు పాల్పడడం, కొట్టడం కులాన్ని, సంఘాలను అడ్డం పెట్టుకుని వేధింపులకు గురి చేయడం, అట్రాసిటీ కేసులు పెట్టడం వంటివి చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న కొందరిలో రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరు తారస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే పుంగనూరు శేషాద్రిని ప్రత్యర్థులు ఈనెల 25న అతి దారుణంగా కత్తులు, కొడవళ్లతో హత్య చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో క్రైమ్ నెంబర్ 152/2024 కేసు నమోదు చేసిన మదనపల్లి డిఎస్పి ప్రసాద్ రెడ్డి, టూ టౌన్ సీఐ యువరాజు, వన్ టౌన్ సీఐ పల్లి భాష, తాలూకా సిఐ శేఖర్, రూరల్ సర్కిల్ సీఐ సద్గురుడు, ఎస్ఐ వెంకటసుబ్బయ్య తదితరులు తమదయిన స్టైల్లో కేసునుల్లోతుగా దర్యాప్తు చేపట్టి రాబడిన పక్కా సమాచారంతో నిందితులను అరెస్టు చేసి ఇన్నోవా బైకులు ఆటోలను సీజ్ చేసినట్లు చెప్పారు