*అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం మద్దిగరువు సంతలో మావోయిస్టులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేసిన గిరిజనులు*
ఈరోజు అనగా తేదీ 30.05.2024న మద్దిగరువు సంతలో మావోయిస్టులకు వ్యతిరేకంగా కిల్లంకోట, బోయితిలి, ఇంజరి, గిన్నెలకోట, జామిగూడ, కుంతర్ల పంచాయతీ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో దాదాపుగా 500 మంది పాల్గొన్నారు. మావోయిస్టులారా మా అల్లూరి జిల్లాకు రావద్దు అని నినాదాలు చేసినారు. ఇంతకుముందు మావోయిస్టులు సంచరిస్తున్న సమయంలో లేని అభివృద్ధిని మరియు ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులను చూపిస్తూ ఈ ర్యాలీని నిర్వహించినారు. గత సంవత్సరం నుంచి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో జరుగుతున్న టవర్ నిర్మాణాలు రోడ్ల నిర్మాణాలు గురించి చెబుతూ, ప్రభుత్వం నుంచి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా జరగాలని కోరారు. మావోయిస్టు సంచరిస్తున్న సమయంలో సంతకు వెళ్లేందుకు కూడా భయపడే వాళ్ళమని చెప్పి ఇప్పుడు ఎటువంటి భయం లేకుండా పాడేరు విశాఖపట్నం తిరగడానికి వీలవుతుందని సంతోషం వ్యక్తం చేశారు. కావున మావోయిస్టు లేకపోతేనే అభివృద్ధి జరుగుతుంది అని తెలుసుకుని ఈ ర్యాలీ నిర్వహించినట్టు తెలియజేశారు. ఈ ర్యాలీలో మావోయిస్టుల చేతిలో బలి అయిన వ్యక్తుల బాధిత కుటుంబాలు కూడా పాల్గొన్నారు.