మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ మాధవి కి ఏయూ డాక్టరేట్

 




మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ మాధవి కి ఏయూ డాక్టరేట్ 


ఆంధ్ర విశ్వవిద్యాలయం మెకానికల్ ఇంజనీరింగ్ విభాగ పరిశోధక విద్యార్థిని, విశాఖలో మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఐ. మాధవికి డాక్టరేట్ లభించింది. 


విభాగ ఆచార్యులు ఎల్.ఎస్.వి ప్రసాద్ పర్యవేక్షణలో డీజిల్ ఇంజన్ల లో ఉద్గారాలను తగ్గిస్తూ వాటి సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా జరిపిన పరిశోధనకు డాక్టరేట్ లభించింది. బయో డీజిల్ లో టైటానియం నానో పార్టికల్స్ ను జోడించి ఇంధనంగా ఉపయోగించి ఈ పరిశోధనను నిర్వహించారు. ఏ.యూ ఉపకులపతి ఆచార్య పివిజిడి ప్రసాదరెడ్డి నుంచి డాక్టరేట్ ఉత్తర్వులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిటిసి డాక్టర్ జి.సి రాజారత్నం, ఏ.ఓ ఐ. రఘు బాబు పాల్గొని మాధవిని అభినందించారు. ఈ సందర్భంగా విభాగ ఆచార్యులు, పరిశోధకులు విద్యార్థులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవికి అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు