పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోదీ .. పూర్తి షెడ్యూల్ ఇదే..


 *ఏపీకి కూటమి కోసం సారు వస్తున్నారు ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోదీ .. పూర్తి షెడ్యూల్ ఇదే..*


ఏపీపై బీజేపీ ఫోకస్‌ పెంచింది. ఏపీ ఎన్నికల ప్రచారం చివరి చరణంలో మోదీ రాక వేడి పుట్టిస్తోంది. 


కూటమి కోసం ప్రచారం చేయడానికి ఏపీ వస్తున్నారు మోదీ.


మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రికి రానున్నారు ప్రధాని. అక్కడినుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌, ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరితో కలిసి రాజమండ్రి రూరల్‌‎లోని వేమగిరి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు.


సాయంత్రం 5:45 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు మోదీ.



తర్వాత అనకాపల్లిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌, ఎమ్మెల్యే అభ్యర్థుల తరఫున మోదీ ప్రచారం చేయనున్నారు. 



ఈ నెల 8న మధ్యాహ్నం రెండు గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు మోదీ. పీలేరు అసెంబ్లీ పరిధిలోని కలికిరి సభలో, చంద్రబాబు పవన్‌తో కలిసి పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడ చేరుకుని..ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి బెంజి సర్కిల్‌ వరకు రోడ్‌ షోలో పాల్గొంటారు మోదీ. ప్రధాని సభలకు పెద్దఎత్తున తరలి రావాలంటూ బీజేపీ శ్రేణులకు, ప్రజలకు పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు.