వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట

 వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట




AP: ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట దక్కింది. జూన్ 5 వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. పిన్నెల్లి కోసం పోలీసులు గాలిస్తుండగానే ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసులో ఈ ఎమ్మెల్యే ఏ-1గా ఉన్నారు.