మత్తుపదార్థాల వాడకం వల్ల యువత చెడు పోతుందని డిసిపి సత్తిబాబు తెలియజేశారు.
ఈ మేరకు గురువారం మాధవ దార లో గ్రాండ్ మిలన్ ఫంక్షన్ హాల్ లో యువకులతో కలిసి డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. డీసీపీ సత్తిబాబు మాట్లాడుతూ మత్తుపదార్థాల వాడకం వల్ల యువతి యువకులు చెడు పోతున్నారని అన్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా విద్యార్థులు మత్తు పదార్థాలు సేకరించడం ద్వారా తన భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని అన్నారు. అలాగే ఉద్యోగ అభివృద్ధి కేంద్రంలో మత్తుపదార్థాల
వాడకం వల్ల వచ్చే రోగాలు, ఇతరత్ర అనర్ధాలు, తద్వారా యువత చెడు వైపుకు పయనిస్తుందని కూలంకుశంగా విద్యార్థినీ విద్యార్ధులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. రోజురోజుకి యువత సమాజ అభివృద్ధి కోసం ప్రయణించాల్సి ఉండగా, చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారని, మత్తు పదార్ధాలు, ఇతరత్ర డ్రగ్స్కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన అన్నారు.సమాజానికి ఉపయోగపడే యువత చెడువైపు పయణిస్తే సమాజం అభివృద్ధి చెందకపోవడమే కాకుండా వారి కుటుంబాలు సైతం చిన్నాభిన్నం అవుతాయని. విద్యార్థులు, యువకులు ఈ విషయాన్ని గమనించి మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిపిలు నాగరత్నం, జి శ్రీనివాసరావు మరియు వెస్ట్ ఎసిపి అన్నెపు నరసింహమూర్తి, సీఐ లు ఎం శ్రీనివాసరావు , సిహెచ్ ప్రసాద్, సురేష్, ఎస్సైలు కే. రామకృష్ణ , విజయ్ కుమార్, సమీర్, ఏ. రామకృష్ణ పాల్గొన్నారు