డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం *ఇవాళ అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం*


Jun 26, 2024,


ఇవాళ అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం

ప్రపంచవ్యాప్తంగా జూన్ 26న‌ అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని జ‌రుపుకుంటారు. ప్రజలు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారంటే సమాజం తిరోగమనంలో పయనిస్తోందని అర్థం. అలాంటి చోట సామాజిక, మానసిక, శారీరక అనారోగ్యాలు తలెత్తుతాయి. అందుకే దేశభవిష్యత్తును కుంగదీసే మాదకద్రవ్యాలను పకడ్బందీగా అరికట్టాలి. మత్తు పదార్ధాల వినియోగం వల్ల ఏర్ప‌డు దుష్ఫలితాలు గురించి, అక్రమ రవాణాను అరికట్టడం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ముఖ్యోద్దేశ్యం