రుషికొండ పై డిఫెన్స్ లో వైకాపా



 *రుషికొండ పై డిఫెన్స్ లో వైకాపా*


ఫిబ్రవరి 29,2024 రుషికొండ ప్యాలెస్ ప్రారంభించిన రోజున టూరిజం మంత్రి రోజా చెప్పిన మాట  విశాఖ రాజధానిగా సంకల్పించినందున ఇందులో సిఎం క్యాంపు కార్యాలయం కోసం ఉపయోగిస్తే మంచిది అని త్రిమెన్ కమిటీ సూచన. భవిష్యత్తులో పర్యాటకం కోసం ఉపయోగించాలా లేక సిఎం కార్యాలయంగా ఉపయోగించాలా అని తర్వాత స్పష్టత ఇస్తాం " అంటే జగన్ మళ్ళీ గెలిచి ఉంటే ఇపుడు తాడేపల్లి తరహా ఋషికొండ ప్యాలెస్ లో నివాసం సహా అదే సీఎం క్యాంపు కార్యాలయం. 


ఈరోజు గంటా చొరవతో రుషికొండ విలాసవంతమైన భవనం మొత్తం బయటపడింది. కళ్ళు బైర్లు కమ్మేలా అత్యంత విలాసవంతంగా ఉండి ప్రజాధనంతో దాదాపు 450 కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన ఆ ప్యాలెస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో విశాఖకు రాష్ట్రపతి ప్రధాని వచ్చినప్పుడు విడిది ఉండటానికి అని వైకాపా మాట మార్చింది.


నిజంగా రాష్ట్రపతి ప్రధాని తరహా పై స్థాయి వ్యక్తులు వచ్చి ఉండడానికి అయితే అదే విషయాన్ని బహిరంగంగా ఆరోజే చెప్పి ఉండొచ్చు పర్మిషన్ తీసుకుని ఉండవచ్చు. కానీ అపుడు ఈ మాట చెప్పలేదు. 


పైగా ఏడాదికి ఒకసారి మహా అయితే ఐదుసార్లు వచ్చే రాష్ట్రపతి ప్రధాని వంటి రాజ్యాంగ పెద్దల కోసం అయితే భద్రతాపరంగా నేవీ గెస్ట్ హౌస్ ఉంది. రాష్ట్రపతి ఒకసారి నేవీడే ఉత్సవాల కోసం వచ్చినా విశాఖలో బస చేయలేదు. ఇటీవల ప్రమాణ స్వీకారానికి హోం మంత్రి అమిత్ షా వచ్చినప్పుడు విజయవాడ నోవాటెల్ లో ఉన్నారు. విలాసవంతంగా ఉండాలి అనుకుంటే నోవాటెల్ రాడిసన్ తాజ్ ప్రేమ వంటివి విశాఖలో ఉన్నాయి.‌ ఏడాదికి మహా అయితే కోటి రూపాయలు ఖర్చు వేసుకున్న 400  సం.లు పైగా పాటు పెద్దలకు విడిది ఇవ్వవచ్చు లేదా పెద్దల విడిది కోసం ప్రభుత్వ భవనం అని ఆరోజే చెప్పి ఉండవచ్చు. డిఫెన్స్ లో ఉన్న వైకాపా ఏదో చెప్పాలి ఏదో కౌంటర్ ఇవ్వాలి అని ఇస్తున్నారు కానీ వారి వాదనలో సహేతుకత లేదు. అడ్డంగా దొరికి అడ్డుగోలు వాదన...


జర్నలిస్ట్ గోపాలరావు✍️✍️✍️