*బాపట్ల మున్సిపాలిటీలో జమ్ములపాలెం వెళ్లే దారిలో ఉన్న డంపింగ్ యార్డులో రీసైక్లింగ్ ద్వారా చెత్త సమస్య తీరిందని తప్పుడు కథనాలతో సాక్షి పేపర్లో ప్రచురించుకున్న శానిటేషన్ ఇన్స్పెక్టర్ కొండయ్య గారిపై చర్యలు తీసుకోవాలని.... బహుజన్ సమాజ్ పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్చార్జ్ గుదే రాజారావు డిమాండ్ చేశారు.*
*బాపట్ల మున్సిపాలిటీలో శాంటేషన్ కొండయ్య కమిషనర్ లాగా వ్యవహరించడం పై ఆశ్చర్యం వేస్తుంది*
*రెండు మూడు సంవత్సరాల క్రితం రీసైకిలింగ్ చేసిన ఫోటోని మే నెల సోమవారం 20వ తారీఖున ప్రచురించుటపై బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తుంది*
. *గత మూడు రోజుల నుంచి డంపింగ్ యార్డ్ తగలబడుతున్న దాని నుండి వెలుబడుతున్న పొగ వల్ల అనేకమంది వాహనదారులు ఇబ్బంది పడుతున్న పర్యావరణానికి హాని కలుగుతున్న పట్టించుకోని అధికారులు*
*దీనిపై బాపట్ల మున్సిపాలిటీ కమిషనర్ బొజ్జ శ్రీకాంత్ గారి నీ కలిసి ఫిర్యాదు చేయడానికి పట్టణ ప్రజల తరఫున సిద్ధంగా ఉన్నామని బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్... గుదే రాజారావు తెలియజేశారు*