*గిరిజన బిడ్డలను చంపి వేస్తే తప్ప అరెస్టు చేయరా*
*అన్నమయ్య జిల్లా పోలీసులు తీరు దౌర్భాగ్యం*
*ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుక్కే విశ్వనాథ్ నాయక్*
గిరిజన బిడ్డలను చంపివేస్తే తప్ప అరెస్టు చేయరా అంటూ ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుక్కే విశ్వనాథ నాయక్ స్థానిక రాయచోటి సిపిఐ పార్టీ కార్యాలయంలో బాధితులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు...
ఈ సందర్భంగా..గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు దళిత కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి మండ్యం సుధీర్ కుమారులు మాట్లాడుతూ...
పెద్దమండెం మండలం వడ్డే వంక తండాలో ఈనెల 13వ తేదీన.. బుక్కే రవీంద్ర నాయక్ ను.. అదే గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ భర్త అయినటువంటి యుగంధర్ రెడ్డి , మరియు రమణారెడ్డి దయా రెడ్డి ప్రతాపరెడ్డి మరియు వారి అనుచరులతో. ముఖ్య రవీంద్రనాయకులు మారిన ఆయుధాలతో అత్యంత కిరాతకంగా చంపి వేయడానికి ప్రయత్నం చేసి చనిపోయాడని వదిలివేసిపోయినటువంటి.. నిందితులను ఎందుకు ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు హాస్యస్పదంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ పేరు తోటి వారికి సమయం ఇస్తూ. గిరిజన బిడ్డల పైన అనేక రకాల భౌతిక దాడులకు పాల్పడుతూ.. మీరు కేసు వితడ్రా చేసుకోకపోతే మిమ్మల్ని చంపి వేస్తామని నిందితులు బెదిరించడం దౌర్భాగ్యం అని ఆవేదన వ్యక్తం చేశారు. గడచిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో అసైన్మెంట్ పట్టాలు ఇప్పిస్తానంటూ గిరిజనుల దగ్గర వేలాది రూపాయలు డబ్బులు గుంజుకుని అసైన్మెంట్ పట్టాలు ఎందుకు ఇప్పించలేదు మా డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగిన పాపాన ఇంత దాస్టికానికి పాల్పడడం సిగ్గుచేటని.. అలాంటి దుర్మార్గులను చట్టప్రకారం కఠినంగా శిక్షించి గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారికి ఫిర్యాదు చేసారు.
*బాధితులకు న్యాయం చేయకుండా బాధితులపైనే అక్రమ కేసులా!*
ప్రాణాపాయ స్థితిలో ఉన్న గిరిజన బిడ్డలకు న్యాయం చేయకుండా వారిపైన అక్రమ కేసులు బనాయించడం దౌర్భాగ్యం అని.. సర్పంచ్ గారి భర్త యుగంధర్ రెడ్డి.. ఆయన రాజకీయ పలుకుబడితో.. వారి ఇంటిలో దొంగతనం జరిగిందని అందుకోసం వారి పైన దాడి చేశామని వారు తప్పించుకొని బండరాతికి బైకులు ఆయనే గుద్దుకొని పడిపోయాడని... కథలో అల్లడంతో పాటు ఏకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసిన పోలీసులు... ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి గిరిజన బిడ్డను ఆదుకోవడానికి నిందితులను ఎందుకు ఇప్పటివరకు అరెస్టు చేయలేదు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు...
తప్పకుండా గిరిజన బిడ్డలంతా ఏకమై రవీంద్ర నాయకు న్యాయం జరిగేంత వరకు న్యాయపోరాటం చేస్తామని అలా కానీ పక్షంలో పువ్వెత్తుతున్న ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు.